OG : టాలీవుడ్ లో బిజీ అవుతున్న బాలీవుడ్ యాక్టర్స్

పాన్ ఇండియా సినిమాల జోరు అన్ని భాషల ఇండస్ట్రీలలో ఎక్కువైంది. ఈ మధ్య కాలంలో వస్తోన్న అన్ని సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ కోసమే చూస్తున్నాయి. కంటెంట్ బాగున్నా సినిమాలు భాషతో, యాకర్ట్స్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తుండటంతో అందరి దృష్టి వీటిపైనే పడింది.

అయితే సినీ పరిశ్రమలలో ఎప్పటి నుంచే ఉన్నఈ కల్చర్ బాహుబలి, సినిమాతో ఊపందుకుంది. ఆ తరువాత కన్నడ ఇండస్ట్రీ నుంచి రిలీజైన కెజీఎఫ్ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా రిలీజై, సంచలన విజయాన్ని సాధించింది. దాంతో హిందీ, మలయాళం, తమిళ్ భాషల్లో తీస్తున్న సినిమాలు కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్యనే లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజై మంచి విజయాన్ని సాధించింది.

ఇక విషయానికొస్తే పాన్ ఇండియా సినిమా కల్చర్ పెరగటం వల్ల క్రాస్ కోలాబిరేషన్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. టాలీవుడ్ సినిమా అంటే టాలీవుడ్ నటులు మాత్రమే ఉండాలనే భావన పోయి ఇతర ఇండస్ట్రీ నుంచి యాక్టర్స్ ని తీసుకుంటున్నారు. అయితే తమిళ్, తెలుగులో విషయానికొస్తే ఈ భావన ఎక్కువగా లేదనే చెప్పాలి ఎందుకంటే తమిళ్ సినిమాల్లో తెలుగు ఆర్టిస్ట్స్ యాక్ట్ చేయడం, తెలుగు సినిమాల్లో తమిళ్ వాళ్ళు యాక్ట్ చేయడం తరుచుగా జరుగుతూనే ఉంటుంది. కానీ తాజాగా బాలీవుడ్ యాక్టర్స్ కూడా తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తుండటంతో దాంతో తెలుగు దర్శకులు కూడా పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ యాక్టర్స్ ని కాస్ట్ చేస్తున్నారు.

- Advertisement -

ఇప్పటికే ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న దేవర సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా, అనిల్ రావిపూడి, బాలయ్య బాబు కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రామ్ పాల్ నటిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న OG సినిమాలో కూడా బాలీవుడ్ యాక్టర్ నే విలన్ గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట మూవీ టీం. అయితే ఎవరిని తీసుకోబోతున్నారనే విషయం పై క్లారిటీ లేకున్నా ఒకప్పటి స్టార్ హీరోని తీసుకోబోతున్నారని సమాచారం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు