Khushi : విజయ్ దేవకొండతో లిప్ లాక్ ఒకే చెప్పిన సమంత

విజయ్ దేవరకొండ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తోన్న ఖుషి సినిమా గురించి అందరికి తెలిసిందే. విజయ్ కి జోడి గా ఈ సినిమాలో సమంత నటిస్తుండగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది.

అయితే చాలా రోజుల క్రితమే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా సమంత అనారోగ్యం కారణంగా చాలా రోజులపాటు సెట్స్ పైకి వెళ్ళలేదు. ఆ తరువాత సమంత ఆరోగ్యం కాస్తా కుదుటపడేసరికి శాకుంతలం సినిమా రిలీజ్ కి ఉండటంతో సమంత, శాకుంతలం ప్రమోషన్స్ లో బిజీ అయిపొయింది. అయితే భారీ అంచనాల మధ్య రిలీజైన శాకుంతలం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇలా ఖుషి సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి ఎదో ఒక అడ్డంకి వచ్చి షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.

ప్రస్తుతం ఏ విధమైన అడ్డంకి లేకుండా సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇటీవలనే ఈ సినిమాకి సంబంధించి విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్బంగా నా రోజా నువ్వే అంటూ సాగె పాటని రిలీజ్ చేయగా, ఆ సాంగ్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

- Advertisement -

ఇంటెన్స్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక సీన్ కి సంబంధించి డైరెక్టర్ శివ నిర్వాణ సమంత, విజయ్ దేవరకొండ లని లిప్ లాప్ పెట్టుకోవాల్సిందిగా అడిగాడట, అయితే విజయ్ మరియు సమంత మొదట ఒప్పుకోకుండా ఉండి ఆ తరువాత సినిమా కోసమే కదా యస్ చెప్పినట్టు టాక్. మైత్రి మూవీస్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ లు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 1న సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు