Devara: ఫిజిక్ కోసం తారక్ బాగానే కష్టపడుతున్నాడు కదా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ సొంతంగా కష్టపడి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనంతరం హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ పొందుతున్నారు. ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ అంటే బాలకృష్ణ కంటే ముందే వినిపించే పేరు ఎన్టీఆర్.

అలాంటి ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే సినిమాలో నటిస్తున్నారు తారక్. అలాంటి ఎన్టీఆర్ ఫిట్నెస్ సీక్రెట్ గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ఫుడ్ సీక్రెట్ గురించి ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అశోక్ సినిమా సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎంత లావుగా ఉండేవారో తెలిసిన విషయమే.

ఆ తరువాత కంత్రి సినిమా సమయంలో బరువు తగ్గినప్పటి నుండి ఎన్టీఆర్ తన డైట్ విషయంలో ఒకే రకమైన ఆహారాన్ని తీసుకుంటున్నాడట. ఉదయాన్నే నిద్ర లేవడం తరువాత యోగ, ఎక్సర్సైజ్ అంటూ ఏదో ఒక వర్కౌట్స్ చేసేవారట. ఇక ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా రాగిజావను కచ్చితంగా రెండు గ్లాసులు తాగేవారట. ఆ తరువాత నీటిలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకునే వారట. లేదా రెండు మూడు బాయిల్డ్ ఎగ్స్ తినేవారట.

- Advertisement -

ఇక భోజనం విషయానికి వస్తే ఖచ్చితంగా రాగి జావా నాటుకోడిని ఎంతో ఇష్టంగా తింటారట జూనియర్ ఎన్టీఆర్. ఎలాంటి డైట్ ఫాలో ఐనా సరే తాను తినాలనుకునే ఆహారాన్ని కచ్చితంగా తీసుకుంటారట. ఇక రాత్రి సమయంలో డిన్నర్ కి ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటారట. ఈ డైట్ ని కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాకుండా ఆయన ఫ్యామిలీ మొత్తం ఫాలో అవుతారట. ఇలాంటి డైట్ ను ఫాలో అవుతున్నాడు కాబట్టే యంగ్ టైగర్ ఫిజక్ ఆనాటి నుంచి నేటి వరకు అలాగే ఉంటుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు