2018: బన్నీవాసు అప్పట్లో ఇచ్చిందే ఇప్పుడు తిరిగొస్తుందా..?

ఒకప్పుడు గీతా ఆర్ట్స్ సంస్థలో పని చేసి ప్రస్తుతం జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు బన్నీ వాసు. ప్రస్తుతం బన్నీవాసు తెలుగులో డబ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసిన మలయాళ సినిమా 2018 డీసెంట్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ సూపర్ హిట్ దిశగా పయనిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రమోషన్ కి పెద్దగా సమయం లేకుండా హడావిడిగా విడుదల చేసినప్పటికీ, ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అవ్వటం వల్ల ఓటీటీలో ఇప్పటికే దాదాపు చాలా మంది చూసేసారు. అయినా కానీ, ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వటం, విజువల్స్ బాగున్నాయన్న మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వటం వల్ల ఈ సినిమాను థియేటర్లో చూసేందుకు మొగ్గుచూపుతున్నారు తెలుగు ప్రేక్షకులు. దీంతో తొలిరోజు 2018సినిమాకు 1.01కోటి రూపాయల గ్రాస్ వచ్చింది. పెద్దగా ప్రమోషన్స్ చేయని డబ్బింగ్ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ రావటం గొప్ప విషయమని చెప్పాలి.
ఇదిలా ఉండగా 2018 సినిమా సక్సెస్ మీట్ లో ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించాడు నిర్మాత బన్నీ వాసు. అదేంటంటే 2018లో గీత గోవిందం ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్న బన్నీ వాసు ఆ సమయంలో సినిమాని మలయాళంలో డబ్ చేసి విడుదల చేద్దామనుకొని ఏవో కారణాల వల్ల తెలుగు వర్షన్ నే కేరళలో రిలీజ్ చేశారట. అదే సమయంలో కేరళలో వరదలు రావటంతో సినిమా ద్వారా వచ్చిన షేర్ ని కేరళ ప్రభుత్వానికి విరాళంగా ఇద్దమని ఫిక్స్ అవ్వగా, గీత గోవిందం సినిమా అనూహ్య రీతిలో 63లక్షల షేర్ కలెక్ట్ చేసిందని, ఆ మొత్తాన్ని కేరళ ప్రభుత్వానికి అందజేశామని తెలిపారు. అప్పట్లో తాను కేరళ ప్రజలకు చేసిన సాయం ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ రూపంలో తిరిగొస్తుందేమో అని అభిప్రాయపడ్డాడు బన్నీ వాసు.
దీన్ని బట్టి చూస్తే, మనం సమాజానికి ఏం ఇస్తామో, అదే సమాజం మనకు వెనక్కి ఇస్తుందన్న నానుడి నిజమే అనిపిస్తుంది. మొత్తానికి సినిమాలో కంటెంట్ బాగుంటే, హంగు ఆర్భాటాలు, పీక్ లెవెల్లో ప్రమోషన్స్ లేకున్నా కూడా మౌత్ టాక్ తో సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవుతాయని 2018 సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. ఈ క్రమంలో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై తొలిరోజు మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ఏ మేరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు