SSMB28: మహేష్, త్రివిక్రమ్ సినిమా నుండి థమన్ అవుట్ – కారణం ఎవరు..?

సూపర్ స్టార్ మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలైన నాటి నుండి ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వస్తోంది. ఆ మధ్య మహేష్ బాబు సమ్మర్ వెకేషన్ కి వెళ్ళటం వల్ల షూటింగ్ వాయిదా పడ్డ సందర్భంలో షూటింగ్ ఆగిపోయిందని, షెడ్యూల్ స్టార్ట్ అవ్వటానికి చాలా సమయం పడుతుందంటూ రూమర్లు వచ్చాయి. అయితే, నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లారిటీ ఇచ్చి ఆ రూమర్లకు చెక్ పెట్టాడు. ఇక మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్బంగా ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్ప్స్ ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు టీమ్ అనౌన్స్ చేయగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో, ఈ సినిమా విషయంలో మరో రూమర్ మహేష్ ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న థమన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని వార్తలొస్తున్నాయి. సినిమా మొదలై  చాలా కాలం అవుతున్నా కూడా ఈ సినిమా మ్యూజిక్ విషయంలో థమన్ పెద్దగా దృష్టి పెట్టకపోవటమే కారణం అంటూ వార్తలొస్తున్నాయి. మరో పక్క సర్కారువారి పాట సినిమా సమయంలో తాము ఆశించిన స్థాయిలో మ్యూజిక్ ఇవ్వలేదంటూ మహేష్ ఫ్యాన్స్ థమన్ పై మండిపడ్డారు. ఇది దృష్టిలో పెట్టుకున్న మహేష్ థమన్ ని ఈ సినిమా నుండి తప్పించాడని కూడా రూమర్స్ వస్తున్నాయి.
అయితే, ఇటీవల వారసుడు, వీరసింహారెడ్డి వంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన థమన్ మహేష్ సినిమా నుండి తప్పుకున్నాడు అన్న రూమర్స్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరి, ఈ రూమర్స్ లో నిజమెంతో తెలియాలంటే మే 31వరకు వేచి చూడక తప్పదు. మహేష్ కెరీర్లో ఎప్పుడు లేని విధంగా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో, డిఫరెంట్ డైలాగ్ మాడ్యులేషన్ తో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2024 సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్న సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు