Chaithu: క్రేజీ కాంబినేషన్లో నాగచైతన్య నెక్స్ట్ సినిమా..!

ఇటీవల కస్టడీ సినిమాతో డిజాస్టర్ అందుకున్న అక్కినేని హీరో నాగచైతన్య, తన తదుపరి సినిమా కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడని సమాచారం వార్తలొస్తున్నాయి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ సినిమా ద్వారా క్లొఇవుడ్లో ఎంట్రీ ఇవ్వాలని భావించిన చైతూకి నిరాశ ఎదురవడంతో ఈసారి జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. చైతు తర్వాతి సినిమా బన్నీ వాసు నిర్మాణంలో కార్తికేయ2 ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకున్న దర్శకుడు చందు మొండేటి డైరెక్షన్లో ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. చైతు, చందు మొండేటి కాంబినేషన్ గతంలో కమిట్ అయిన ప్రాజెక్ట్ అని సమాచారం అందుతోంది.
కెరీర్ ఆరంభం నుండి బ్లాక్ బస్టర్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న నాగచైతన్య తదుపరి సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టి తన సత్తా చాటాలన్న కసితో ఉన్నాడట. ఈ సినిమాకు సంబంధించి చందు వినిపించిన కథకు చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ప్రస్తుతం సినిమా ప్రి ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో క్రేజీ ప్రాజెక్ట్స్ తో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న నిర్మాత బన్నీ వాసు, పాన్ ఇండియా హిట్ అందుకున్న చందుల కాంబినేషన్ తమ హీరోకి బ్లాక్ బస్టర్ అందించటం ఖాయం అని అక్కినేని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా అధికారిక ప్రకటన రాని ఈ ప్రాజెక్ట్ లో చైతు సరసన హీరోయిన్ ఎవరు?, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు వంటి అంశాలపై క్లారిటీ రావాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు. చైతు, చందు మొండేటి కాంబినేషన్లో గతంలో ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు వచ్చాయి. ప్రేమమ్ హిట్ అవ్వగా, సవ్యసాచి సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేదు. ఇప్పుడు చందు, చైతుల కాంబినేషన్లో మూడో సినిమా రాబోతోంది అన్న వార్తలొస్తున్న తరుణంలో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. మరి, ఈ సినిమా ద్వారా అయినా నాగచైతన్య బ్లాక్ బస్టర్ అందుకుంటాడా లేదా వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు