Custody: ఆ హీరోపై మరోసారి తన ఇష్టాన్ని బయటపెట్టిన బేబమ్మ

‘ఉప్పెన’ సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైన కన్నడ బ్యూటీ కృతి శెట్టి. నటించిన తొలి సినిమాతోనే యువతను ఆకర్షించి స్టార్ హీరోయిన్ రేంజ్ పాపులారిటీని సాధించింది. ఆ తర్వాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు లాంటి సినిమాలతో సక్సెస్ లు అందుకుంది. అయితే ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్లు మళ్ళీ రాలేదు. ‘శ్యామ్ సింగరాయ్’ హిట్ అయినప్పటికీ కృతి అందులో సెకండ్ హీరోయిన్ అవ్వటంతో క్రెడిట్ దక్కలేదు. గత కొంత కాలంగా ఈ హీరోయిన్ కి ప్లాపులు పలకరిస్తూనే ఉన్నాయి. వారియర్, మాచర్ల నియోజకవర్గం, సినిమాలతో డిజాస్టర్లు అందుకున్న కృతి శెట్టి తాజాగా నాగ చైతన్య “కస్టడీ” సినిమాతో మళ్ళీ పలకరించింది.

అయితే మే 12 న విడుదలైన కస్టడీ మిక్సడ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. అయినా ఈ సినిమాకు ప్రమోషన్లు మాత్రం చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా జరిగిన కస్టడీ ఇంటర్వ్యూ లో నాగచైతన్య, కృతి శెట్టి పాల్గొనడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ లో కృతి శెట్టిని తన ఫేవరేట్ హీరో ఎవరని అడగ్గా సిగ్గుపడుతూనే తన అభిమాన నటుడు రామ్ చరణ్ అని చెప్పింది. తనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలనీ కోరిక అని అంది. పక్కనే ఉన్న నాగ చైతన్య కూడా చరణ్ అంటే చాలా ఇష్టమనీ, తన యాక్టింగ్ స్టైల్ ను కూడా చాలా ఇష్టపడతానని అన్నాడు. అయితే గతంలో కృతిశెట్టి ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్ ప్రమోషన్స్ లో కూడా రామ్ చరణ్ గురించి ఇలాగే చెప్పింది. ఇక కస్టడీలో రేవతిగా డీ గ్లామరైజ్ రోల్ లో నటించి మెప్పించిన కృతిశెట్టి ప్రస్తుతం మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ బిజీ గా ఉంది.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు