UBS : పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రెండు తెలుగు రాష్ట్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన పవన్ ప్రస్తుతం టాలీవుడ్ లోనే టాప్ హీరోగా ఉన్నారు. ఓవైపు సినిమాల్లో యాక్టివ్ గా ఉంటూనే మరోవైపు రాజకీయాలలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం అనే పార్టీ ద్వారా రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సొంతంగా జనసేన పార్టీ పెట్టి 2024లో సీఎం అవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

ఇక ఆయన రాజకీయాలలోకి వచ్చినప్పటి నుండి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఎప్పుడూ చర్చ సాగుతూనే ఉంది. పవన్ ని విమర్శించడానికి ఇదొక్కటే ఆయుధం అన్నట్లుగా మారింది. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ మొదటి భార్య పేరు నందిని అనే సంగతి తెలిసిందే. 1997లో నందిని ని పెళ్లి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల 2007లో ఆమెకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ మొదటి భార్య మీడియాకు చాలా దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. నందిని స్వస్థలం వైజాగ్ కావడం గమనార్హం. అయితే ప్రస్తుతం నందిని తన పేరును మార్చుకున్నారని.. అమెరికాలో ఉన్నారని బోగట్టా. నందిని ఆస్తుల విలువ 200 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని టాక్. 2010లో కృష్ణారెడ్డి అనే ఒక డాక్టర్ ని పెళ్లి చేసుకున్న నందిని అమెరికాలో సెటిల్ అయింది. ప్రస్తుతం ఆమె తన భర్త పిల్లలతో సంతోషంగా ఉంది. ఆమె సోషల్ మీడియాకు సైతం చాలా దూరంగా ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

For More Updates :

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు