Aarthi Agarwal: ఆ ఒక్క తప్పే ప్రాణాల మీదకు తెచ్చిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల క్రితం హీరోయిన్ ఆర్తి అగర్వాల్ అంటే ఒక సంచలనం. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్లపాటు కొనసాగింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తో జత కట్టిన ఆర్తి.. ఆ తరువాత ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, తరుణ్, మహేష్ బాబు, బాలకృష్ణ, రవితేజ వంటి అగ్ర హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.

అమెరికాలో స్థిరపడిన ఒక గుజరాతీ ఫ్యామిలీలో న్యూ జెర్సీలో 1984 మార్చ్ 5న జన్మించింది ఆర్తి. ఈమె 14 ఏళ్ల వయసులో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఫిలడెల్ఫీయలోని ఒక స్టేజ్ షోలో ఆర్తి అగర్వాల్ డాన్స్ చూసి ముచ్చటపడిన అమితాబచ్చన్ ఆమెను హిందీలో యాక్ట్ చేయడానికి ప్రోత్సహించారట. అలా 2001లో హిందీలో పాగల్ పాన్ అనే చిత్రంలో నటించింది.

ఆ తర్వాత వెంకటేష్ హీరోగా కే విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం కావడంతో ఇక ఆర్తి వెనక్కి తిరిగి చూసుకోలేదు. మూడేళ్లపాటు తెలుగులో అందరు స్టార్ హీరోలతో నటించి ఎన్నో సూపర్ హిట్లు కొట్టేసింది. 51 పైగా చిత్రాలలో నటించిన ఆమె అర్ధాంతరంగా తనువు చాలించింది. 2007లో న్యూ జెర్సీకి చెందిన ఉజ్వల్ నికమ్ ను పెళ్లి చేసుకున్న ఆర్తి.. కొంతకాలం తర్వాత వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆర్తి.. మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. అప్పుడు కాస్త బరువు పెరిగిన ఆర్తి.. ఆ బరువుని తగ్గించుకునేందుకు తీసుకున్న నిర్ణయమే ఆమె ప్రాణాలను తీసిందని టాక్. స్థూలకాయం, శ్వాసకోశ సమస్యలతో బాధపడిన ఆమె 2017 జూన్ 4న అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో లైపోసెక్షన్ సర్జరీ చేయించుకుంది. ఆ తరువాత చికిత్స వికటించడంతో గుండెపోటు వచ్చి ఇన్ఫెక్షన్ రావడంతో జూన్ 6న ఆర్తి అగర్వాల్ కన్నుమూసింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు