Bellamkonda Srinivas : హిందీ ఛత్రపతి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది

బాలీవుడ్ తో అంత ఈజీ కాదని మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఛత్రపతి సినిమాతో ఋజువైంది. వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన హిందీ చిత్రం ఛత్రపతి. 2005లో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో స్టార్ట్ అయిన రాజమౌళి, ప్రభాస్ ల సక్సెస్ జర్నీ బాహుబలి సినిమా వరకు సాగింది. అయితే ఈ సినిమాని అదే పేరుతో హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేసిన విషయం అందరికి తెలిసిందే

తెలుగులో ఛత్రపతి సినిమా బ్లాక్ బస్టర్ అయిన మాట వాస్తవమే. కానీ అదెప్పుడో 18 యేళ్ళ క్రిందటి మాట. అప్పటికి, ఇప్పటికి పరిస్థితులలో, ప్రేక్షకులు అభిరుచుల్లో మార్పులు గణనీయంగా వచ్చాయి. అందుకే అవుట్ డేటెడ్ రీమేక్ సినిమాలని ప్రేక్షకుల మొహమాటం లేకుండ రిజెక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా భారీ అంచనాల మధ్య రిలీజైన కిసీకి భాయ్, కిసీకా జాన్, ఛత్రపతి సినిమాల కలెక్షన్లే దీనికి నిదర్శనం.

హిందీ బెల్ట్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కి క్రేజ్ ఉన్నమాట నిజమే, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేసిన అన్ని తెలుగు సినిమాలని హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తుండటంతో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో బాగా పాపులర్ అయ్యారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన “జయ జానకి నాయక ” సినిమా హిందీ డబ్ వెర్షన్ ఏకంగా 720 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే హిందీలో తన సినిమాలు ప్రేక్షకులు బాగా చూస్తున్నరనే నమ్మకంతో బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. గత వారం (మే 12న) గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం మొదటి రోజు కేవలం 45 లక్షల షేర్ తో డిజాస్టర్ గా నిలిచింది.

- Advertisement -

సినిమా రిజల్ట్ పై మొదటి నుంచి నమ్మకంగా ఉన్న మూవీ టీం. సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసారు. కానీ జనాలని థియేటర్ కి రప్పించలేకపోయారు.సినిమా చూసిన కొంతమంది ప్రేక్షకులు కూడా సినిమాలో ఏమి లేదని తేల్చేసరికి ఈ సినిమా బాలీవుడ్ లో కంప్లిట్ గా వాష్ అవుట్ అయిపొయింది. ఈ సినిమాతో బాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టి స్టార్ హీరోగా ఎదగాలనే బెల్లంకొండ శ్రీనివాస్ ఆశలు నిరాశగానే మిగిలిపోయాయి. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ ఈ రీమేక్ సినిమా కాకుండా ఏదైన మంచి కంటెంట్ తో వచ్చి ఉంటె రిజల్ట్ ఇలా ఉండేది కాదని అందరు అభిప్రాయ పడుతున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు