Koko: క్రియేటివ్ డైరెక్టర్ రిలీజ్ చేసిన ఫస్ట్ అథెంటిక్ స్కైఫై చిత్రం గ్లిమ్ప్స్

టాలీవుడ్ లో వరుస బెట్టి పాన్ ఇండియా చిత్రాలు రూపొందడమే గాక ఇతర భాషలకంటే కొత్తగా మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు వస్తున్నాయి. పెద్ద హీరోలతో, స్టార్ కాస్ట్ తో రాకపోయినా ఉన్నంతలో హై టెక్నికల్ వాల్యూస్ తో చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. అలాగే తొలి సినిమాతోనే గ్రాండ్ ఎంట్రీ కోసం తపిస్తూ కార్తీక్ దండు లాంటి కొత్త దర్శకులు వస్తున్నారు. ఇక హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు తెలుగులోను ఇప్పుడు రూపొందుతున్నాయి. అలా తెలుగులో లేటెస్ట్ గా ఓ యూనివర్సల్ స్కైఫై కాన్సెప్ట్ తో పాన్ ఇండియన్ సినిమాగా మొట్ట మొదటి అథెంటిక్ స్కైఫై చిత్రం గా వస్తున్న మూవీ “కోకో”.

జై కుమార్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సందీప్ వాసా నిర్మిస్తున్నాడు. తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా కోకో ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ ని లాంచ్ చేసారు. ఫ్యూచర్ లో జరిగే సైబర్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతుంది. ఇంట్రెస్టింగ్ విజువల్స్ మరియు హై ప్రొడక్షన్ వాల్యూస్ తో అయితే ఈ గ్లింప్స్ డిజైన్ చేయబడింది. మరి సినిమాలో కూడా ఇదే రేంజి టెక్నాలజీని వాడారో లేదో తెలియాలి.

- Advertisement -

అయితే మేకర్స్ చెప్తున్న దాని ప్రకారం ఈ చిత్రంలో పాకిస్తాన్ మరియు చైనీస్ హ్యాకర్లు ఇండియా మీద చేసే సైబర్ వార్ ఏంటి? మరో పక్క నిక్కీ అనే బ్లాక్ హ్యాట్ లేడీ హ్యాకర్ కనిపెట్టిన “కోకో” అనే సెల్ఫ్ మేడ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏమవుతుంది. ఆమె తండ్రి కనిపెట్టిన ఫార్ములా ఏంటి అనే ఇంట్రెస్టింగ్ లైన్ తో అయితే ఈ సినిమా తెరకెక్కుతున్నట్టుగా తెలిపారు. ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అయితే గ్రాఫిక్స్ వర్క్ పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టాల్సింది. ఇక కోకో సినిమాను 2024 లో పాన్ ఇండియా మూవీగా దక్షిణాది భాషలతో, ఇంకా హిందీలోనే కాక, వియాత్నమెస్, తైవానీస్ భాషల్లో కూడా విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు