Chiranjeevi: ప్రముఖ ఏషియన్ అవార్డ్స్ లిస్ట్ లో మొదటిసారి చిరు,చరణ్! సౌత్ నుంచి ఫస్ట్

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ తరువాత మూడు దశాబ్దాల పాటు నెంబర్ వన్ గా ఆధిపత్యాన్ని చూపించిన నటుడాయన. ఇప్పుడు కూడా టాప్ హీరోలకు పోటీనిస్తూ సినిమాలు చేస్తున్నాడంటే ఆయన క్రేజ్ ఏంటో అర్ధం చేస్కోవచ్చు. ఇక ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో సినిమాలు చేస్తూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు రామ్ చరణ్. ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు రామ్ చరణ్. అంతేకాదు వరల్డ్ టాప్ దర్శకుడు జేమ్స్ కేమరూన్ లాంటి దర్శకుడు చరణ్ పాత్రని మెచ్చుకోవడం చిరుకి ఎంతో సంతోషాన్ని ఇవ్వడమే గాకుండా గర్వ కారణం అయింది.

అయితే తాజాగా ఓ ప్రముఖ ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో మెగాస్టార్ తో సహా రామ్ చరణ్ కూడా కలిసి ఎంపిక కావడం మెగా ఫ్యాన్స్ కి గర్వకారణంగా మారింది. ఆసియాలో ప్రముఖ అవార్డ్స్ “ఆసియన్ “హాల్ ఆఫ్ ఫేమ్” వారు ఇంటర్నేషనల్ గా అనేకమంది సినీ ప్రముఖుల్ని నామినీస్ గా ఎంపిక చేయగా అందులో “విజనరీ లీడర్స్” జాబితాలో అయితే చిరంజీవి, రామ్ చరణ్ లు ఎంపిక అయ్యారు.

అయితే సౌత్ నుంచి ఎంపిక అయిన మొదటి నటులుగా చిరు మరియు చరణ్ లు నిలవడం విశేషం. అలాగే ఈ వేడుకలను, హాలీవుడ్ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలు నిర్వహించిన “ఐకానిక్ బిల్ట్ మోర్” హోటల్లో అయితే జరుపనున్నట్టుగా ఆ సంస్థ వారు తెలియజేసారు. ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ తో పాటు, సౌత్ ఇండియన్ సినీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ అవార్డ్స్ ఫంక్షన్ ని జరపనున్నట్టు సమాచారం. ఏది ఏమైనా తెలుగు ఖ్యాతి ఖండాంతరాలు దాటాలన్న చిరంజీవి కల ఇలా మరోసారి నెరవేరుతున్నందుకు మెగాభిమానులు సంతోషిస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు