Power Star: రిలీజ్ డేట్ సరే – టైటిల్ ఎక్కడ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’, సుజిత్ డైరెక్షన్లో ‘ఓజీ’, హరీష్ శంకర్ డైరెక్షన్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సాయిధరమ్ తేజ్ తో కలిసి సముద్రఖని డైరెక్షన్లో ‘వినోదాయ సీతాం’ రీమేక్ ల షూటింగ్ లో ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేస్తూ బిజీగా ఉన్నాడు. వినోదయ సీతాం రీమేక్ కి సంబంధించి షూటింగ్ ఇప్పటికే పూర్తైన తరుణంలో జులై 28న సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది సినిమా యూనిట్. అయితే, ఈ సినిమా టైటిల్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోవటం పట్ల పవన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టైటిల్ ‘బ్రో’ అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి కానీ, అధికారిక ప్రకటన అయితే లేదు.

పవన్ కళ్యాణ్ రాజకీయాలకు గ్యాప్ ఇచ్చి వరుసగా సినిమాలు చేయటం పట్ల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తుంటే, మరో పక్క ఏ సినిమాకు కూడా 30, 40రోజులకు మించి పవన్ డేట్స్ కేటాయించకుండా చకచకా చుట్టేస్తుండటం వల్ల సినిమా క్వాలిటీ విషయంలో ప్రభావం పడుతుందా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

రిలీజ్ దగ్గరపడుతున్న ఇంకా టైటిల్ అనౌన్స్ చేయని ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల విరుపాక్షతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా మేనల్లుడు పవర్ స్టార్ తో కలిసి నటించటంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సోసియో ఫాంటసీ జానర్లో తెరకెక్కిన వినోదాయ సీతాం తమిళ్ మంచి హిట్ గా నిలిచింది. మరి, అలాంటి కథకి తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఎలాంటి మార్పులు చేశారు, ఇటీవల వార్తలొచ్చినట్టు ఈ సినిమా టైటిల్ ‘బ్రో’ అన్నదాంట్లో నిజమేనా?, వంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే కొంత కాలం వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు