Tarak: ఎన్టీఆర్ అరుదైన రికార్డ్ – గ్లోబల్ స్టార్ అంటూ ఫ్యాన్స్ హంగామా..!

RRR సినిమా తర్వాత టాలీవుడ్ కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లను గ్లోబల్ స్టార్స్ అంటూ ఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. అంతే కాకుండా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ట్విట్టర్లో ఓ అరుదైన ఘనత సాధించి వార్తల్లో నిలిచాడు. 2022 మర్చి నుండి 2023 ఏప్రిల్ వరకు 25మిళియన్లకు పైగా మెన్షన్స్ సాధించిన తొలి టాలీవుడ్ స్టార్ గా రికార్డ్ సాధించాడు.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. RRR సినిమా ఆస్కార్ అవార్డు సాధించటం, వార్ 2 వంటి బాలీవుడ్ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తుండటం వల్ల సోషల్ మీడియాలో ఎన్టీఆర్ గురించి ఎక్కువగా చర్చ జరిగేందుకు అవకాశం ఇచ్చిందని, ఇదే ఈ ఘనత సాదించేందుకు కారణం అని అంటున్నారు. ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే ఎన్టీఆర్ తరచూ తన సన్నిహితులకు, తోటి హీరోలకు విషెస్ చెబుతూ ట్వీట్లు వేస్తుంటాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ఈ రేర్ ఫీట్ ని సాధించటంతో గ్లోబల్ స్టార్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.

ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా, హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటించనున్నారు. ఎన్టీఆర్ 30వ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు