K Vishwanath : కళాతపస్వి కన్నుమూత….

తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. తెలుగు సినిమా పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమై.. తన పేరును కళాతపస్వి మార్చుకున్న డైరెక్టర్ కాశీనాధుని విశ్వనాధ్ (92) కన్నుమూశారు. వృద్దాప్యాయ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. తన సినిమాలతో ప్రేక్షకులను రంజింపచేయడమే కాకుండా తెలుగుదనాన్ని, సాంప్రదాయాల్ని ఆయన కథలతో, సినిమాలతో ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు. ఓ శంకరాభరణం, ఓ సిరి సిరి మువ్వ, ఓ స్వాతిముత్యం, ఓ శుభసంకల్పం.. ఇలా తెలుగు సినీ రంగానికి ఎన్నో ఆణిముత్యాలు లాంటి చిత్రాలను అందించారు కె విశ్వనాథ్.

గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెద్దపులివర్రు గ్రామం ఆయన స్వస్థలం. 1931 ఫిబ్రవరి 19న కాశీనాధుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. కె విశ్వనాథ్ కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్, ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆయన తండ్రి చెన్నైలోనే విజయ వాహిని స్టూడియోలో పనిచేసేవారు. దీంతో విశ్వనాధ్ డిగ్రీ పూర్తవుగానే అదే స్టూడియోలో సౌండ్ రికార్థిస్ట్ గా పనిచేశారు.

- Advertisement -

ఆయన తొలిసారి పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్ రికార్దిస్ట్ గా చేశారు. 1965లో ఆత్మగౌరవం సినిమా దర్శకుడిగా అవకాశం లభించింది. తొలి చిత్రానికే ఆయన నంది అవార్డు అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని గౌరవాన్ని తీసుకువచ్చిన విశ్వనాధ్ 50 కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. కళాతపస్వి మరణం పట్ల పలువురు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు