Allu Arjun : ఆ రికార్డులన్నీ బన్నీకే సాధ్యం..!

Allu Arjun: టాలీవుడ్ లో మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరచుకున్నారు అల్లు అర్జున్.. ఆ తర్వాత ఐకాన్ స్టార్ గా కూడా మారిపోయారు.. అయితే ఈ పిలుపుకు తగ్గట్టుగానే అల్లు అర్జున్ పలు రికార్డులను కూడా సెట్ చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు.. ఇటీవలే ఒక సరికొత్త రికార్డుతో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కూడా అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.. దాని ఆవిష్కరణకు కూడా అల్లు అర్జున్ స్వయంగా వెళ్లారు.

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం..

ఈ విషయం విని అభిమానులు సైతం అల్లు అర్జున్ కు అభినందనలు తెలియజేస్తున్నారు.. టాలీవుడ్ గౌరవాన్ని మరింత పెంచారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మరోవైపు ఈ మ్యూజియం లో జరిగిన అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణకి అల్లు అర్జున్ ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్ళింది. ఇప్పటివరకు ఈ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేష్ బాబు , ప్రభాస్ వంటి హీరోల మైనపు విగ్రహాలు మాత్రమే ఉన్నవి.. అంతేకాదు అవి లండన్ మ్యూజియంలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ విగ్రహం మాత్రం ఏర్పాటు చేసింది దుబాయ్ మ్యూజియంలో.. ఈ మ్యూజియంలో మొట్టమొదటి సారి ఇలాంటి గౌరవం అందుకున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేశారు..

దుబాయ్ గోల్డెన్ వీసా..

అయితే కేవలం ఇందులో మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలలో కూడా అల్లు అర్జున్ నెంబర్వన్ గా నిలిచారు.. దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న మొట్టమొదటి టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్ నిలవడం జరిగింది.. అలాగే యాక్టింగ్ పరంగా బెస్ట్ నేషనల్ అవార్డును కూడా అందుకున్న మొట్ట మొదటి తెలుగు హీరోగా పేరు సంపాదించారు. అలాగే న్యూయార్క్ సిటీలో గ్రాండ్ మార్షల్ లో పాల్గొన్న మొట్టమొదటి తెలుగు హీరోగా కూడా అల్లు అర్జున్ పేరు సంపాదించారు.

- Advertisement -

ఇంస్టాగ్రామ్ డాక్యుమెంటరీ వీడియో..

అలాగే ఇంస్టాగ్రామ్ లో కూడా డాక్యుమెంటరీ వీడియో చేసిన మొట్టమొదటి హీరోగా కూడా అల్లు అర్జున్ ( Allu Arjun ) ఉండటం గమనార్హం.. ఇలా అన్నిటిలో కూడా తానే నెంబర్ వన్ గా అనిపించుకున్న అల్లు అర్జున్ కు ఐకాన్ స్టార్ అనే ట్యాగ్ కూడా అందుకు తగ్గట్టుగా ఉందని అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైనా ఒక హీరో ఎన్ని రికార్డులను సొంతం చేసుకోవడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి.

అల్లు అర్జున్ ప్రస్తుత సినిమాలు..

ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. పుష్ప -2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.. అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా అల్లు అర్జున్ ఒక సినిమా చేయడానికి సన్న హాలు చేస్తున్నారు ఇక ఈ సినిమా తర్వాత ఆయన మరే డైరెక్టర్ కి అవకాశం ఇస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు