Ranbir – Alia : ముద్దుల కూతురు కి ఖరీదైన గిఫ్ట్.. ఎన్ని కోట్లంటే..?

Ranbir – Alia : ప్రముఖ బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్, బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ ఫిలిం ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా మంచి పేరు దక్కించుకున్న విషయం తెలిసిందే.. ఈ జంట కి ఒక ముద్దుల పాపాయి కూడా జన్మించింది.. అయితే తాజాగా ఈ జంట తమ కూతురికి ఖరీదైన బహుమతిని అందించినట్లు తెలుస్తోంది.. ఇక అదేంటో ఇప్పుడు చూద్దాం..

రూ.250 కోట్ల విలువైన బహుమతి..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రన్బీర్ కపూర్ , ఆలియా భట్ ( Ranbir – Alia ) తమ ముద్దుల కూతురికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారని.. వీటిలో టాక్ వినిపిస్తోంది..తాజాగా అందుతున్న నివేదిక ప్రకారం లగ్జరీ బంగ్లాను నిర్మించి ఇవ్వనున్నట్లు సమాచారం. అది పూర్తయితే ముంబైలోనే అత్యంత ఖరీదైన బంగ్లాగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇక దీని విలువ సుమారుగా రూ .250 కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు.. ఒకవేళ ఈ బంగ్లా గనుక నిర్మించడం పూర్తి అయితే బాలీవుడ్ స్టార్ హీరోలైన షారుక్ ఖాన్ మన్నత్ , అమితాబ్ బచ్చన్ జల్సా బంగ్లాలతో పోల్చుకుంటే అత్యంత ఖరీదైన ఇల్లుగా ఇది నిలవబోతోంది..

రిచెస్ట్ స్టార్ కిడ్ గా రాహా..

ఇకపోతే ముంబైలోనే బాంద్రా లో ఉన్న ఒక బంగ్లాలో బాలీవుడ్ జంట రణబీర్ కపూర్ , ఆలియా భట్ తో పాటు నీతూ కపూర్ కలిసి కనిపించారు.. ఆ బంగ్లాకి రణబీర్ కపూర్ తన కుమార్తే రాహా కపూర్ పేరు పెట్టనున్నట్లు సమాచారం. దీంతో ఏడాది వయసులోనే రాహా కపూర్ బాలీవుడ్ లో అత్యంత పిన్న వయసులో ధనవంతురాలిగా గుర్తింపు దక్కించుకోబోతోంది. అంతేకాదు రణ్ బీర్ , ఆలియా ఇద్దరు కూడా తమ కూతురు కోసం తాము సంపాదించిన డబ్బులలో సమానంగా పెట్టుబడి పెడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.. దీంతో పాటు వీరికి ముంబైలో నాలుగు ఫ్లాట్స్ కూడా ఉన్నాయి.. పైగా వాటి విలువ రూ.60 కోట్లకు పై మాటే.. దీంతో ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

- Advertisement -

బంగ్లాకు రాహా అమ్మమ్మ సహ యజమాని..

ఇకపోతే రాహా కోసం నిర్మించబోయే బంగ్లాకి రాహా అమ్మమ్మ నీతూ కపూర్ సహా యజమానిగా ఉంటారని తెలుస్తోంది.. ఇటీవలే ఈమె బాంద్రా ప్రాంతంలో రూ.15 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. బంగ్లా పూర్తయిన తర్వాత నీతూ కపూర్ ఫ్యామిలీతో సహా ఆ బంగ్లాలో ఉండనున్నట్లు సమాచారం.. ఇకపోతే ప్రస్తుతం ఆలియా భట్, రణబీర్ కపూర్ , రాహా వస్తు అనే ప్రాంతంలో నివసిస్తున్నారు.. ఏది ఏమైనా రణబీర్ కపూర్, అలియా భట్ ఇద్దరూ కూడా తమ కూతురి కోసం ఇలాంటి అత్యంత ఖరీదైన బంగ్లాను నిర్మించడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి.. ప్రస్తుతం బాలీవుడ్ లో వైరల్ గా మారిన ఈ వార్త ఇటు సౌత్ సినీ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా బాలీవుడ్ లోనే అత్యంత ధనవంతులైన స్టార్ సెలబ్రిటీలను కూడా దాటేసి రాహా కోసం ఇంత ఖరీదైన బంగ్లాను నిర్మించడం నిజంగా అద్భుతమని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు