Lifestyle : వర్క్ పై ఫోకస్ చెయ్యలేకపోతున్నారా? ఈ టిప్స్ మీ కోసమే..

Lifestyle : చాలామంది సీరియస్ గా ఏదైనా ఒక పనిని చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే వాళ్ళ దృష్టి చేయాల్సిన పనిని వదిలేసి వేరే దానిపైకి మరలుతుంది. దీంతో ప్రారంభించిన పనులను మధ్యలోనే ఆపేస్తారు. ఇలా చేయడం వల్ల పని ఆలస్యం కావడం మాత్రమే కాకుండా ప్రాడక్టివిటీ తగ్గుతుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఫోకస్ లోపించడమే. పరధ్యానం… అంటే మీరు చేస్తున్న పనిపై మీకే స్పృహ లేదని అర్థం. ఇలా చేయడం వల్ల ఉద్యోగం లేదా వ్యక్తిగత జీవితంపై ఎఫెక్ట్ పడుతుంది. మరి ఈ ఏకాగ్రత లోపాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అంటే దానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. దృష్టి వేరే వాటిపైకి మరలకుండా వర్క్ పై ఎలా ఫోకస్ చేయాలంటే?…

1. పనిని విభజించండి

ఏ పని చేయాలన్నా పంక్చువాలిటిని కచ్చితంగా ఫాలో అవ్వాలి. మీరు ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు దానిని చిన్న చిన్న భాగాలుగా విభజించండి. ఒక భాగానికి సంబంధించిన పనిని పూర్తి చేశాక కాసేపు విరామం తీసుకుని మళ్ళీ ప్రారంభించండి. ఇలా చేయడం వల్ల పని భారంగా అనిపించదు. అలాగే త్వరగా అలసిపోరు. ఎందుకంటే అలసిపోయినప్పుడు కూడా పరధ్యానం వచ్చేస్తుంది. ఎక్కువ గంటలు పని చేయడం వల్ల ఇన్స్పిరేషన్ లోపిస్తుంది. ఫలితంగా పని చేయాలనిపించదు. ఇంకేముంది వెంటనే వేరే దాని పైకి దృష్టి ఆటోమేటిక్ గా మరలుతుంది. కాబట్టి పనిని భాగాలుగా విభజించుకొని పూర్తి చేయండి.

2. పనులను లిస్ట్ చేయడం

పనిని వాయిదా వేయడం అనేది అలవాటుగా మారితే ఆ తర్వాత సోమరిపోతులు అయిపోతారు. దానివల్ల కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. అందుకే ఈరోజు నిద్రపోయే ముందే మరుసటి రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులను లిస్ట్ చేయండి. దానికి తగ్గట్టుగా అలారంను సెట్ చేసుకోండి. మీరు ఏ పని ఎప్పుడు చేస్తున్నా దాన్ని పూర్తి చేయడానికి ఒక గడువు పెట్టుకోండి. ఇలా చేయవలసిన పనుల జాబితాను ముందుగానే రూపొందించడం ద్వారా మీ పని గురించి మీరు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారు. సమయానికి పూర్తి చేయగలుగుతారు. అలాగే కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది.

- Advertisement -

3. సోషల్ మీడియాను పరిమితం చేయండి

ఈరోజుల్లో సోషల్ మీడియా వల్ల ప్రజల్లో ఫోకస్ అనేది కొరవడుతుంది అంటున్నారు సైకాలజీ నిపుణులు. సాధారణంగా సోషల్ మీడియా యాప్ లను ఓపెన్ చేసినప్పుడు తెలియకుండానే గంటలు గంటలు దాన్ని చూస్తూ గడిపేస్తారు. ఫోన్లో సమయం తెలియకుండా మునిగిపోతారు. కానీ సోషల్ మీడియాలో రోజుకు రెండు గంటల కంటే ఎక్కువ సేపు గడపకుండా చూసుకోవాలి. ఫోన్ లేదా లాప్టాప్ నుంచి అనవసరమైన యాప్ లను డిలీట్ చేయండి. అప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అనవసరమైన విషయాల మీదకు మరలదు.

4. నోటిఫికేషన్ ఆఫ్ చేయండి

ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు మీ ఫోన్ చేసే శబ్దం డిస్టర్బింగ్ గా ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన పనులు చేస్తున్నప్పుడు ఫోన్ వైపు చూడకుండా ఉండాలంటే సైలెంట్ లో పెట్టడమే కాకుండా మిగతా యాప్ లకు సంబంధించిన నోటిఫికేషన్లను కూడా ఆఫ్ చేసేయండి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే వర్క్ పై ఫోకస్ చేయడం ఈజీ అవుతుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు