#GangsOfGodavari : గోదావరి అంటే కొబ్బరి చెట్లు కాలువ గట్లు కాదు అంతకుమించి

తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సాహిత్య రచయితగా ఎంట్రీ ఇచ్చాడు కృష్ణ చైతన్య. ఎన్నో అద్భుతమైన చిత్రాలకు మంచి పాటలను రాశాడు ఆ పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. అయితే నానా రోహిత్ హీరోగా చేసిన రౌడీ ఫెలో సినిమాతో దర్శకుడుగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. రౌడీ ఫెలో సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి కృష్ణ చైతన్య అందించిన డైలాగ్స్. ఆ సినిమాను తీసిన విధానం. ఆ సినిమాలో నారా రోహిత్ క్యారెక్టర్జేషన్ డిజైన్ చేసిన విధానం ఇవన్నీ కూడా ప్రేక్షకులకి ఆసక్తికరంగా అనిపించాయి. అయితే ఆ సినిమా తర్వాత కృష్ణ చైతన్య చేసిన సినిమా ఛల్ మోహన్ రంగ. ఈ సినిమాకు కథను త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత దర్శకత్వానికి కొంత గ్యాప్ ఇచ్చాడు కృష్ణ చైతన్య.

ప్రస్తుతం కృష్ణ చైతన్య చేస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా టీజర్ రీసెంట్గా రిలీజ్ అయింది. టీజర్ కూడా ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తుంది. విశ్వక్సేన్ నటిస్తున్న ఈ సినిమా మే 17న రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ ఈవెంట్ లో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు చిత్ర యూనిట్.

విశ్వక్సేన్ నటిస్తున్న ఈ సినిమా తన కెరీర్ లోనే బెస్ట్ గా ఉండబోతుంది అంటే చెప్పుకొచ్చాడు విశ్వక్. ఈ సినిమాలో తన డ్రీమ్ రోల్ నెరవేరింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఇప్పటివరకు వచ్చిన తెలుగు సినిమాల్లో చాలావరకు గోదావరి అంటే మంచితనం, మర్యాద, ప్రకృతి అందాలు చూపిస్తూ వచ్చారు చాలామంది దర్శకులు. అయితే ఈ సినిమా మాత్రం అలా కాకుండా వేరే కోణాన్ని కూడా ఆవిష్కరించబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు కృష్ణ చైతన్య.

- Advertisement -

అలానే పురాణాల గురించి ప్రస్తావిస్తూ పూర్వం జరిగే కథలను పురాణాలు అంటారంటూ చెప్పుకొచ్చాడు. అలానే కొన్ని పుక్కిటి పురాణాలు అంటూ ఉంటాయి అలా లంకల దీవి గురించి విన్న కొన్ని కథలకి కొంత కల్పితం జోడించి ఈ సినిమాను తీశాను అంటూ చెప్పుకొచ్చాడు. అలానే గోదావరి అంటే కేవలం మంచితనం ప్రకృతి అందాలు మాత్రమే కాదు మాలో కూడా ఒక టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు చాలామంది రాజకీయ నాయకుల్లో మీరు అది చూసే ఉంటారు. ఈ సినిమాలో అలా చూపించే ప్రయత్నం చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు.

రౌడీ ఫెలో సినిమా తర్వాత కృష్ణ చైతన్య తన కథతో సినిమా చేయటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను మొదట త్రివిక్రమ్ శ్రీనివాస్ కు చెప్పాడంట కృష్ణ చైతన్య. అయితే హీరో ఎవరు అనుకుంటున్నారు అని అడిగినప్పుడు విశ్వక్సేన్ అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడంట. త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగ వంశీ కలిసి విశ్వక్సేన్ తో మాట్లాడటంతో ఈ సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమాలో విశ్వక్సేన్ సరసన నేహా శెట్టి నటిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు