HBD Samantha: ఆ ఘనత ఒక్క సామ్ కే సాధ్యం..!

HBD Samantha.. ప్రముఖ టాలీవుడ్ బ్యూటీ సమంత 1987 ఏప్రిల్ 28న చెన్నైలో పుట్టి అక్కడే పెరిగింది.. ఇక ఈరోజు 37వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ ..ఈ సందర్భంగా ఈమె గురించిన ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి.అందులో భాగంగానే కొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

HBD Samantha: That feat is only possible for Sam..!
HBD Samantha: That feat is only possible for Sam..!

ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లు పూర్తి..

సమంత తండ్రి జోసెఫ్ ప్రభు తెలుగు వ్యక్తి కాగా.. ఈమె తల్లి నెనెట ప్రభు.. వీరు తమిళనాడులోని చెన్నైలో స్థిరపడ్డారు.. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది సమంత.. ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ ,మలయాళం భాషలలో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది.. ముఖ్యంగా తెలుగు, తమిళ్ సినీ ఇండస్ట్రీలో ఉండే అగ్ర హీరోలు అందరితో కూడా నటించిన ఈమె.. సినిమా నటీనటులతో మంచి సత్సంబంధాలను కూడా ఏర్పరుచుకుంది.. ఇక ఇటీవలే ఇండస్ట్రీకి హీరోయిన్ గాఅడుగు పెట్టి 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమంత.. సినీ కెరియర్ లో ఎన్ని విజయాలనైతే చూసిందో వ్యక్తిగతంగా అంతే విమర్శలు కూడా ఎదుర్కొంది..

సంతోషం ఎంతుందో దుఃఖం కూడా అంతే..

తెలుగు హీరో అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుని విడాకుల పొందడం ఆమె జీవితంలో అత్యంత చీకటి రోజులుగా చెప్పవచ్చు.. అంతే కాదు మయోసైటిస్ అనే వ్యాధి బారిన కూడా పడింది ..అందుకు సంబంధించిన చికిత్సను ఇప్పటికి తీసుకుంటూనే ఉంది ఈ ముద్దుగుమ్మ ఇంకా పూర్తిగా కోలుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అనారోగ్యం కారణంగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తోంది.. అందుకే విదేశాలను చుట్టేస్తూ వెకేషన్ లంటూ ఎంజాయ్ చేస్తోంది సామ్.

- Advertisement -

ఈ ఘనత సామ్ కే సొంతం.

ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో ఈమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కి హనీ బన్నీ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇకపోతే సమంత పుట్టినరోజు సందర్భంగా ఎవరికి తెలియని ఒక వార్త వైరల్ గా మారుతోంది. అదేమిటంటే తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ఒకేసారి ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడం.. ఇప్పటివరకు ఏ హీరోయిన్ కి ఇలాంటి అదృష్టం వరించలేదు. మొదటిసారి సమంత ఈ అదృష్టాన్ని, ఘనతను సొంతం చేసుకుంది. 2013లో రేవతి సినిమా తర్వాత ఒకేసారి అటు తెలుగులోను ఇటు తమిళ్ లోను దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకుని రికార్డు సృష్టించింది సమంత. ఇక అలాగే హిందీ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ యొక్క రెండవ సీజన్లో రాజీ పాత్రలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది..

సమంత అందుకున్న అవార్డ్స్..

ఇక సమంత ఏ మాయ చేసావే సినిమాకి గానూ స్పెషల్ జూరీ అవార్డు అందుకోగా.. ఆ తర్వాత ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రానికి 2002లో ఉత్తమ నటి విభాగంలో నంది పురస్కారం సొంతం చేసుకుంది. ఇక అత్తారింటికి దారేది సినిమాకి 2013లో ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకోగా .. ఓ బేబీ చిత్రానికి గాను 2019లో ఉత్తమ నటి కేటగిరీలో సైమా అవార్డును సొంతం చేసుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు