18 Years For Pokiri: ఉత్తమ్ సింగ్ అలా పండుగాడు అయ్యాడు

ఇండస్ట్రీలో ఏవేవో తెలిసిన పనులు చేస్తున్న ఒక యువ దర్శకుడు తన మొదటి సినిమా ప్రారంభించాలి అనుకున్నాడు. అప్పటికే మంచి రేంజ్ లో ఉన్న మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. యంగ్ దర్శకుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తనకు స్నేహితుడైన శ్యామ్ కె నాయుడు సహాయంతో చోటా కె నాయుడుని పట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ కి చోటా కె నాయుడు మంచి ఫ్రెండ్ కావడంతో పవన్ కళ్యాణ్ కి చెప్పాలనుకునే కథను మొదటి నాకు చెప్పు. కథ నాకు నచ్చితే నేను నిన్ను పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్తానంటే ఈ యంగ్ దర్శకుడు కథను చెప్పడం మొదలుపెట్టాడు. చాలా ఇంట్రెస్ట్ గా సినిమా ఓపెన్ చేయగానే హీరో హీరోయిన్ సూసైడ్ చేసుకుంటున్నారు. అని మొదలుపెట్టి చాలా ఆసక్తికరంగా చెప్పాడు.

చోటా కి కథ నచ్చడంతో పవన్ కళ్యాణ్ ను కలిసే అవకాశం కల్పించాడు. కానీ యువ దర్శకుడు పవన్ కళ్యాణ్ కి మరో కథ చెప్పాడు. అదే కథను ఒప్పించి, సినిమాను కూడా చేసి, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ సినిమా పేరు బద్రి. ఆ దర్శకుడు పేరు పూరి జగన్నాథ్. అప్పటికి పవన్ కళ్యాణ్ నటించిన ఒక సినిమాను కూడా చూడలేదు పూరి జగన్నాథ్. కానీ పవన్ కళ్యాణ్ కొత్త వాళ్లకి అవకాశం ఇస్తున్నాడు అని తెలిసి పవన్ కలిసి సినిమా చేశాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడు దొరికాడు అని ప్రూవ్ అయింది. ఆ తర్వాత జగపతిబాబుతో చేసిన బాచి సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేదు.

ఆ తర్వాత పూరి జగన్నాథ్ చేసిన సినిమాలన్నీ దాదాపు మంచి హిట్ అయ్యాయి. వరుసగా హిట్ సినిమాలు చేస్తున్న తరుణంలో ఎవరు ఊహించిన విధంగా ఆంధ్రావాలా సినిమాతో డిజాస్టర్ తగిలింది. ఒక్కసారిగా పూరి చతికిల పడ్డాడు. మళ్లీ సినిమా చేయాలి ఒక సూపర్ హిట్ కొట్టాలి. ఇండస్ట్రీలో మళ్ళీ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేయాలి. ఆ టైంలోనే బద్రి సినిమా అప్పుడు రాసుకున్న ఒక స్క్రిప్ట్ కు బూజు తెలిపాడు. ఆ స్క్రిప్ట్ పేరు “ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్యనారాయన్”.

- Advertisement -

అప్పటికే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు రవితేజ కి అందించాడు పూరి జగన్నాథ్. మళ్లీ రవితేజ తో ఈ సినిమాను తీయడానికి రెడీ అయ్యాడు. కానీ అదే టైంలో తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఆటోగ్రాఫ్ మూవీ ని తెలుగులో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ పేరుతో రీమేక్ అయిన సినిమాలో బిజీ అయిపోయాడు రవితేజ. ఆ తర్వాత సోనూసూద్ తో సినిమా చేయాలనుకున్నాడు పూరి. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు.

ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబుకి కథను నేరేట్ చేశాడు. కథ విని మహేష్ బాబు బాగా ఎక్సైట్ ఫీలయ్యాడు. కానీ సినిమాలో ఉన్న సిక్ బ్యాక్ డ్రాప్ ను మార్చమని అడిగాడు. దాంతో సినిమా టైటిల్ కూడా పోకిరి అని మారిపోయింది. కానీ మహేష్ బాబు కొంత టైం అడిగాడు. ఆ టైంలో పూరి ఖాళీగా ఉండలేక సాయిరాం శంకర్ తో 143, నాగార్జునతో సూపర్ సినిమాలను ఫినిష్ చేశాడు. ఆ తర్వాత పోకిరి సినిమాను చకచకా 70 రోజుల్లో పూర్తి చేశాడు. ఏప్రిల్ 28న 2006లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా రిలీజ్ అయిన ప్రతి భాషలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటికి పోకిరి సినిమా అంటే ఒక టాప్ కమర్షియల్ సినిమాకి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుందని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు