Chitram Cheppina Katha : 9ఏళ్లగా విడుదలకు నోచుకోని ఉదయ్ కిరణ్ మూవీ? రిలీజ్ చేయాలనీ డిమాండ్?

Chitram Cheppina Katha : టాలీవుడ్ లవర్ బాయ్ ఉద‌య్ కిర‌ణ్‌ గురించి ప్రేక్ష‌కులకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన పనిలేదు. అప్ప‌ట్లోనే ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో కెరీర్ బిగినింగ్ డేస్ లోనే వ‌రుస హ్యాట్రిక్ విజయాలతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుని స్టార్ హీరోలకు సైతం పోటీనిచ్చాడు. అయితే ఆ తర్వాత కొన్నాళ్ళకు వరుస పరాజయాలతో చాలా డౌన్ అయ్యాడు. ఒకానొక దశలో మార్కెట్ ని కోల్పోయే దశలో వచ్చిన ఈ హీరో పెళ్లి చేసుకుని కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చినా, జై శ్రీ రామ్ తో మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా కూడా ఆడలేకపోయే సరికి కెరీర్ లో చాలా కృంగిపోయి, వ్యక్తి గత కారణాలతో అర్థాంత‌రంగా త‌నువు చాలించాడు ఉదయ్‌ కిరణ్. అప్ప‌ట్లో ఉద‌య్ మ‌ర‌ణం చుట్టు కూడా ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. అయితే ఉదయ్ కిరణ్ నటించిన చివరి సినిమా “చిత్రం చెప్పిన కథ” ఇప్పటి వరకు రిలీజ్ కి నోచుకోలేదు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ డిమాండ్ తో మళ్ళీ ఈ వార్త ట్రెండ్ అవుతుంది.

ఓటిటి లో వస్తుందన్నా రాలేదు..

అయితే ఉద‌య్ చివ‌రిగా న‌టించిన చిత్రం మూవీ `చిత్రం చెప్పిన క‌థ‌` 2014 లో విడుద‌ల కావాల్సిన ఈ సినిమా ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. అయితే లాక్ డౌన్ లో థియేటర్స్ బంద్ అయిన తర్వాత చాలా మంది నిర్మాతల కన్ను ఓటిటి విడుదలపై పడింది. ఆ మధ్య బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత అతను నటించిన చివరి సినిమా ‘దిల్ బెచారాను’ కూడా హాట్ స్టార్ ఓటిటి లో రిలీజ్ చేసారు. దాంతో అప్పట్లో ఉదయ్ కిరణ్ చివరి సినిమా ‘చిత్రం చెప్పిన కథ’ కూడా ఓటిటి లో రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. దానికి దర్శక నిర్మాతలు కూడా రెడీ అయ్యారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు ఉదయ్ కిరణ్ చివరి సినిమా రిలీజ్ చేయాలనీ ఇప్పుడు డిమాండ్ మొదలైంది.

ఉదయ్ చివరి చిత్రం డిమాండ్!

ఇక ఉదయ్ కిరణ్ చనిపోయి పదేళ్లవుతున్నా కూడా ఇప్పటికీ తన చివరి సినిమా “చిత్రం చెప్పిన కథ”(Chitram Cheppina Katha) ఇంకా విడుదల కాలేదు. అయితే రీసెంట్ గా నువ్వు నేను సినిమా రీ రిలీజ్ అయిన తర్వాత ఉదయ్ కిరణ్ చివరి సినిమా రిలీజ్ చేయాలనీ డిమాండ్ మొదలైంది. ఇక ఓటిటి లో వస్తుందనుకున్న సినిమా ఇంకా రాకపోవడంతో థియేటర్లలో ఖచ్చితంగా రిలీజ్ చేయాలనీ డిమాండ్ మొదలైంది. ఉదయ్ కిరణ్ అభిమానులు కూడా తమ హీరో చివరి సినిమాను థియేటర్లలో చూడాలనుకుంటున్నారు. ఇక “చిత్రం చెప్పిన క‌థ” సినిమా కు ఏఎల్ఆర్కే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, సీహెచ్ మున్నా నిర్మాత‌గా వ్య‌వహ‌రించాడు. ఇక బాలీవుడ్ న‌టి మ‌దల‌సా శ‌ర్మా ఉద‌య్‌ కిరణ్ కి జోడిగా న‌టించింది. ఇటు ట్రేడ్ విశ్లేషకులు కూడా నెలరోజులుగా పెద్దగా ఆశించిన సినిమాలు లేని ఈ సమయంలో రిలీజ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఉదయ్ చివరి సినిమా చూడాలన్న ఫ్యాన్స్ డిమాండ్ ఎప్పుడు నెరవేరుతోందో చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు