1 Year of Agent : ఏడాదైంది కానీ ఓటీటీ లోకి రాలేదు.

అతనొక్కడే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సురేందర్ రెడ్డి. తన మొదటి సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మాస్ కమర్షియల్ డైరెక్టర్ దొరికాడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కిక్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవితేజ కెరీర్ కూడా అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు నిరాశపరిచిన కూడా, అల్లు అర్జున్ తో చేసిన రేసుగుర్రం సినిమాతో మరోసారి డైరెక్టర్ రేస్ లో ముందుకెళ్లాడు సురేందర్ రెడ్డి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో ధ్రువ అనే సినిమాను చేసి అద్భుతమైన ఘన విజయం సాధించాడు. ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ సినిమా తనివరన్ రీమేక్ గా తెరకెక్కింది.

అయితే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలామందికి ఒక కల ఉంటుంది. కానీ అతి కొద్ది మంది దర్శకులకు మాత్రమే ఆ అవకాశం కుదురుతుంది. అలా అవకాశం దక్కిన అతి కొద్ది మంది దర్శకులలో సురేందర్ రెడ్డి ఒకరు. మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాను చేశారు. మెగాస్టార్ చిరంజీవి తో చేసిన సైరా నరసింహారెడ్డి సినిమాతో మంచి పేరును సాధించుకున్నాడు సురేందర్ రెడ్డి. ఆ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్. బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో అంచనాలతో ఈ సినిమా రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా ఊహించిన డిజాస్టర్ ను మూట కట్టుకుంది.

అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ కి మంచి హిట్ వచ్చిన సినిమా అంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పొచ్చు. అప్పటివరకు దాదాపు నాలుగు సినిమాలు చేసిన కూడా అఖిల్ కి సరైన బ్రేక్ రాలేదు. అయితే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకొని కలెక్షన్స్ కూడా బాగానే వసూలు చేసింది. ఆ సినిమా తర్వాత అఖిల్ చేసిన సినిమా ఏజెంట్. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అఖిల్ పోస్టర్స్ చూసి చాలామంది అంచనాలను పెంచుకున్నారు. ఇది ఒక హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని అందరూ అనుకున్నారు. ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ కూడా ఉండటం కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచింది.

- Advertisement -

ఎట్టకేలకు థియేటర్ వద్దకు వచ్చిన ఈ సినిమా తీవ్ర నిరాశకు గురి చేసింది. అయితే కొన్ని సినిమాలు థియేటర్లో హిట్ కాకపోయినా కూడా ఓటీటీలో మంచి హిట్ అవుతాయి. చాలా సినిమాలు విడుదలైన మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీలో దర్శనమిస్తాయి. థియేటర్స్ లో సాధించలేని రెస్పాన్స్ ను కొన్నిసార్లు ఓటీటీలో సాధిస్తాయి. ఇకపోతే అలానే ఏజెంట్ సినిమాకి కూడా ఇలానే రెస్పాన్స్ వస్తుందని చాలామంది ఊహించారు. ముందుగా ఓటీటీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ ఓటీటీ లో చాలాసార్లు ఆగింది. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ తో ప్రొడ్యూసర్స్ కి ఉన్న విభేదాలు కారణంగా ఈ సినిమా ఆగింది అంటూ వార్తలు కూడా వినిపించాయి.

ఏదేమైనా అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా నేటితో ఒక ఏడాది పూర్తయింది. ఇప్పటికీ ఈ సినిమా చూడాలని చాలామంది ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు అఖిల్ తన నుంచి రాబోయే ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయలేదు. సురేందర్ రెడ్డి కూడా అధికారికంగా తన ప్రాజెక్టును ప్రకటించలేదు. ఏదేమైనా ఎవరికి వారు వ్యక్తిగతంగా మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని చాలామంది అంచనా వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు