Elder Daughter Syndrome : ఎల్డర్ డాటర్ సిండ్రోమ్ అంటే ఏంటో తెలుసా?

Elder Daughter Syndrome : భారతదేశంలో చాలావరకు భారమంతా మొదటి బిడ్డ పైనే వేస్తారు. చాలా ఇళ్లలో ఒక వయస్సు వచ్చిన తర్వాత మొదటి బిడ్డే బాధ్యతలను తీసుకుంటుంది. కుటుంబంలోని మొదటి సంతానం తమ కంటే చిన్నవాళ్ళను అంటే తమ్ముళ్లను, చెల్లెల్లను చూసుకోవడం, ఇంటి పనుల్లో తల్లికి సహాయం చేయడం వంటి అనేక పనులను చాలా చిన్న వయసు నుంచే చేయడం అనేది ఇక్కడ సర్వసాధారణం. మానసికంగా తమను తాము సిద్ధం చేసుకుని చిన్న వయసులోనే పెద్దవాళ్ల లాగా పనులు చేయడం ప్రారంభిస్తారు. ముఖ్యంగా అమ్మాయిలను ఇలా చేయమని చిన్నప్పటి నుంచే ప్రేరేపిస్తారు. పెద్ద కూతురు ఇష్టంగానే చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు తీసుకుంటుంది. దీన్నే ఎల్డర్ డాటర్ సిండ్రోమ్ అని పిలుస్తారు. దీని నుంచి బయటపడడం అనేది చాలా కష్టం. ఈ సిండ్రోమ్ ఎఫెక్ట్ ఎక్కువగా అమ్మాయిల్లోనే కనిపిస్తుంది.

ఎల్డర్ డాటర్ సిండ్రోమ్ కు కారణం ఏంటి?

పిల్లల్లో ఈ తరహా సిండ్రోమ్ ( Elder Daughter Syndrome ) రావడానికి అసలు కారణం పేరెంటింగ్ లో తల్లిదండ్రులు చేసే తప్పులే అంటున్నారు సైకియాట్రిస్టులు. పెద్ద పిల్లలపై తల్లిదండ్రులు ఎక్కువ బాధ్యతలు పెడతారు. వాళ్లకు పని తగ్గడానికి పిల్లలకు ఇలాంటివి నేర్పిస్తూ ఉంటారు చాలా మంది తల్లిదండ్రులు. ముఖ్యంగా పెద్ద కొడుకు లేదా పెద్ద కుమార్తె ఇంటి బాధ్యతలను తలకెత్తుకోవాలి అనే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ సిండ్రోమ్ ను పేరెంటిఫికేషన్ అని కూడా అంటారు. దీనిపై యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధనలు జరిపింది. ఆ పరిశోధనలో ఇలా తమ్ముళ్ళు చెల్లెళ్లను చూసుకోవడం, ఇంటి పనుల్లో సాయం చేయడం వల్ల పెద్ద కుమార్తె మానసికంగా చిన్న వయసులోనే పెద్దదైపోతుందని వెళ్లడైంది.

ఈ సిండ్రోమ్ లక్షణాలు ఏంటి?

బాధ్యతల పేరుతో పిల్లలపై ఒత్తిడినీ తీసుకొస్తే వాళ్ళ ప్రవర్తనలో మార్పులు వస్తాయి. ఎక్కువగా కోపంగా ఉండడం, స్కూల్ గురించి ఎప్పుడు చూసినా కంప్లైంట్ చేయడం, మొండిగా మారడం, తోబుట్టులతో గొడవలు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. పెద్ద కొడుకు కంటే కూతుర్లోనే ఇలాంటి ఆందోళన ఎక్కువగా కనిపిస్తుందని పరిశోధనలో వెల్లడైంది. ఎక్కువగా బాధ్యతయుతంగా ఉండటం, తల్లిదండ్రుల భావాల వల్ల బాధ, బాల్యం సంతోషంగా లేకపోవడం, హద్దుల్లో జీవించడం, అపరాధం, సరిహద్దులను సృష్టించడంలో ఇబ్బంది పడడం వంటివి ఈ సిండ్రోమ్ ఉన్న పిల్లల్లో ఉండే సమస్యలు.

- Advertisement -

ఈ సిండ్రోమ్ నుంచి బయటపడటం ఎలా? ఇది అసలు మంచిదేనా?

ముందుగా తల్లిదండ్రులు మారాలి అంటున్నారు సైకాలజీ నిపుణులు. పొరపాటున కూడా పిల్లల పట్ల వివక్ష చూపకూడదు. ఎవరికైనా ఈ సిండ్రోమ్ ఉంటే దాని నుంచి బయటపడడానికి హెల్ది బౌందరీస్ సెట్ చేసుకోవాలి. తనకు తాను ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ తమ విలువను అర్థం చేసుకోవాలి. నచ్చిన పనులు చేయడం, పుస్తకాలు చదవడం వంటివి ఈ సిండ్రోమ్ నుంచి బయట పడేస్తాయి. ఇంటి బాధ్యతలన్నీ పెద్ద కూతురుకే ఇచ్చే బదులు తల్లిదండ్రులు పిల్లలందరికీ సమానంగా పనులు పంచాలి. ఇక ఈ సిండ్రోమ్ వల్ల చిన్న వయసులోనే ఒత్తిడికి గురి కావడం, కుటుంబ ఆందోళనలో మునిగిపోవడం, స్వీయ సంరక్షణ లేకపోవడం వల్ల పిల్లలు బాల్యాన్ని కోల్పోతారు. దీనివల్ల జరిగే మంచి ఏమిటంటే చిన్నప్పటి నుంచి మనసులో ఆందోళన అనే ఫీలింగ్ వస్తే కుటుంబం అంతా వాళ్లకు తోడుగా ఉంటారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు