HBD Allu Aravind: చిరంజీవి జీవితంలో అల్లు అరవింద్ పాత్ర..మూల కారకుడే..!

HBD Allu Aravind: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిర్మాత గానే కాకుండా బిజినెస్ మాన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇకపోతే ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే చిరంజీవి జీవితంలో అల్లుఅరవింద్ పాత్ర ఎటువంటిది అన్న విషయం వైరల్ గా మారింది. ఇక దీని గురించి ఇప్పుడు మనం పూర్తిగా చదివి తెలుసుకుందాం.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆయన కంటూ ఎవరూ సపోర్టు ఇవ్వలేదట.. అయితే సురేఖను వివాహం చేసుకున్న తర్వాత సురేఖ అన్నయ్య అల్లు అరవింద్ చిరంజీవి జీవితానికి మూలకారకుడు అయ్యారు. ముఖ్యంగా చిరంజీవికి సంబంధించిన సినిమా వ్యవహారాలన్నీ కూడా అల్లు అరవింద్ చూసుకునేవారు. అంతేకాదు చిరంజీవి ఏ సినిమా చేయాలి? ఆయన నుంచి అభిమానులు ఎటువంటి సినిమాలు కోరుకుంటున్నారు? అన్న విషయాలను అన్నీ పూర్తిగా తెలుసుకొని డైరెక్టర్ లతో మాట్లాడి సినిమాలు సెట్ చేసేవారు. అలా చాలా రోజులపాటు చిరంజీవి సినిమాల విషయంలో అల్లు అరవింద్ మొదటి పాత్ర పోషించారు.

చిరంజీవి కూడా అల్లు అరవింద్ చెప్పినట్టే సినిమా ఎంపికల విషయంలో జాగ్రత్తగా పడుతూ మెగాస్టార్ గా మారారు. ఇక అదే సమయంలో అల్లు అరవింద్ కూడా చిరంజీవి ఇమేజ్ ను క్యాష్ చేసుకుంటూ నిర్మాతగా మారి ఆయన సినిమాలకు ప్రొడ్యూసర్ గా బాధ్యతలు చేపట్టి ఆయన కూడా బాగానే సంపాదించారు. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత చిరంజీవి హీరోగా అల్లు అరవింద్ సోలో నిర్మాతగా తన గీత ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించిన మొదటి చిత్రం యమకింకరుడు. ఇక తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో హీరో, ఆరాధన, విజేత, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, మాస్టర్, డాడీ, మెకానిక్ అల్లుడు ఇలా మొత్తం 16 సినిమాలు వచ్చాయి.

- Advertisement -

ఇక ఈ సినిమాలు హీరోగా చిరంజీవిని నిలబెట్టడమే కాదు నిర్మాతగా అల్లు అరవింద్ కి కూడా మంచి విజయాన్ని అందించాయని చెప్పవచ్చు. అలా అల్లు అరవింద్, చిరంజీవి ఇద్దరు కూడా తమ టాలెంట్ ను ఉపయోగించి.. అభిమానులను రాబట్టుకొని భారీగా క్యాష్ చేసుకున్నారని చెప్పడంలో సందేహం లేదు. మొత్తానికైతే చిరంజీవి ఈ స్థాయికి రావడానికి అల్లు అరవింద్ చేసిన కృషి ప్రథమంగా వినిపిస్తుంది అనడంలో సందేహం లేదు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు