Chiranjeevi: మోకాలు నొప్పితో ఇంకా బాధపడుతున్నారా?

Chiranjeevi:  మెగాస్టార్ చిరంజీవి ఇంకా మోకాలి నొప్పితో బాధపడుతున్నారా? రెండు నెలల క్రితం చిరంజీవి మోకాళ్ళ నొప్పులకు ఆపరేషన్ చేయించుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నాడని అంటున్నారు. కానీ తాజాగా చోటు చేసుకున్న సంఘటనలు చూస్తుంటే మెగాస్టార్ ఇంకా కోలుకోలేదా? అనే డౌట్ వస్తోంది. ఇంతకీ చిరుకి మోకాలు నొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం లభించిందా? అంటే…

చిరంజీవి రీసెంట్ గా “వెంకీ 75” ఈవెంట్లో కనిపించారు. విక్టరీ వెంకటేష్ 75 సినిమాలను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేకమైన ఈవెంట్ కు చిరు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన దాదాపు 40 నిమిషాలకు పైగా నిలబడి ఉండాల్సి వచ్చింది. కానీ ఈవెంట్లో ఎక్కువసేపు కూర్చున్నప్పుడు చిరంజీవి అసౌకర్యంగా ఫీల్ అవుతున్నట్టుగా కనిపించారు.

ఒకవైపు రికవరీ అవుతూనే చిరంజీవి సినిమా షూటింగులతో పాటు పలు కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకుంటున్నారు. పూర్తిగా కోలుకోనప్పటికీ చిరంజీవి ఇలా సినిమాకు ఇస్తున్న ప్రాధాన్యతను, సినిమా పట్ల ఆయనకు ఉన్న అంకితభావం ఏంటో తెలియజేస్తుంది. ఇటీవల చిరంజీవి నెక్స్ట్ మూవీ “విశ్వంభర” మూవీ కోసం ఒక వారం మాత్రమే షూటింగ్లో పాల్గొన్నారు.

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ ఫాంటసీ మూవీ “విశ్వంభర”. “బింబిసార” అనే హిట్ మూవీతో డైరెక్టర్ గా పరిచయమైన వశిష్ట రూపొందిస్తున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ మూవీని యువీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ చిరంజీవి కెరీర్ లో 156వ చిత్రంగా రూపొందుతోంది. అందుకే చిత్ర బృందం ఈ మూవీకి “మెగా 156” అనే వర్కింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.

అయితే ఈ సోషియా ఫాంటసీ మూవీకి “విశ్వంభర” అని టైటిల్ ను ఫిక్స్ చేశారని వార్త బయటకు రావడంతో మెగా అభిమానులు అందరూ అదే పేరుతో పిలుచుకుంటున్నారు. ఇక ఈ మూవీని దసరా రోజు లాంచ్ చేశారు. అయితే మోకాలు నొప్పి కారణంగానే చిరంజీవి ఇంకా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయలేదు. “విశ్వంభర” షూటింగ్ అయితే స్టార్ట్ అయింది కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఇంకా షూటింగ్లో జాయిన్ కాలేదు.

అప్పటిదాకా డైరెక్టర్ వశిష్ట హీరో లేకుండా పూర్తి చేయాల్సిన పార్ట్ కు సంబంధించిన షూటింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కాగా జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి నుంచి ఈ మూవీ షూటింగ్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనబోతున్నారు. ఇక “విశ్వంభర” మూవీలో మెగాస్టార్ కు విలన్ గా దగ్గుబాటి రానా నటించబోతున్నాడు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు