Kalki 2898AD: ప్రభాస్ కల్కి మూవీ డేట్ ఫిక్స్..!

Kalki 2898AD: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న హిందూ మైథాలజీ కథా చిత్రం కల్కి 2898AD.. ఈ చిత్రంలో కమలహాసన్, దిశాపటాని, దీపికా పదుకొనే , అమితాబ్ బచ్చన్ వంటి వారు నటిస్తూ ఉండడంతో ఈ సినిమా పై ప్రపంచవ్యాప్తంగా భారీ గా హైప్స్ క్రియేట్ అవుతున్నాయి. వాస్తవానికి ఈ సంక్రాంతి పండుగకి ఈ సినిమా రావాల్సి ఉండగా.. కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడం.. దీనికి తోడు VFX పనుల వల్ల ఆలస్యం అయ్యింది .ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. విడుదల తేదీని సంక్రాంతి కానుకగా అభిమానులకు తెలియజేశారు.. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ని మూవీ టీం సరికొత్తగా ప్రమోషన్స్ తో ప్రమోట్ చేస్తూ.. రిలీజ్ డేట్ ను ఇలా అనౌన్స్మెంట్ కాన్సెప్ట్ తో ఫిక్స్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఈ సినిమాలోని టైటిల్ లో 2898AD అనే టైంలో ఉన్న సంగతి అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ టైం లైన్ కి ఒక టైమర్ ని సెట్ చేశారు.

జనవరి 9వ తారీఖున కల్కి సినిమా టైమర్ మొదలయింది.. ఆ టైమర్ లో..2898 ఇయర్ అని.. ఎప్పుడు చేరుకుంటుందో అప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వస్తుంది అంటూ తెలియజేశారు.. అయితే ఈ సినిమా టైమర్ ఇప్పటికే 2057 వ సంవత్సరానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ టైమర్ ఎప్పుడు 2898 అనే ఇయర్ కి చేరుకుంటుందో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఒకపక్క టైమర్ ని పెట్టుకొని గమనిస్తూ ఉండగానే..రిలీజ్ డేట్ పైన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

- Advertisement -

కల్కి సినిమాని వైజయంతి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. ఈ సంస్థ నుంచి వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి , మహానటి, మహర్షి వంటి చిత్రాలు మే 9వ తేదీన విడుదలై భారీ సక్సెస్ ను అందించాయి.. ఈ బ్యానర్ లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తిండిపోయే చిత్రాలను తెరకెక్కించిన ఘనత వైజయంతి మూవీస్ కు ఉన్నది. దీంతో ఆ రోజు ఈ బ్యానర్ కి బాగా కలిసి రావడంతో కల్కి వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను కూడా ఆరోజు విడుదల చేయాలనే విధంగా చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు చిత్ర బృందం ఈ విషయం పై క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు