Praveen sattaru : టాలీవుడ్ జాన్ విక్ వచ్చేస్తున్నాడు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ సినిమా గాండీవధారి అర్జున టీజర్ అప్డేట్ వచ్చేసింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు సంబంధించి ఇటీవలనే ప్రి- టీజర్ రిలీజ్ చేయగా , మంచి బజ్ క్రియేట్ చేసింది. హాలీవుడ్ సూపర్ హిట్ ఫిలిం సిరీస్ అయిన జాన్ విక్ లాంటి యాక్షన్ మూవీని తలపిస్తున్న గాండీవధారి అర్జున విజువల్స్ ప్రి- టీజర్ వీడియోలో అందరిని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఆగస్ట్ 25న గ్రాండ్ గా రిలీజవ్వబోతుంది.

ఇటీవలనే విరూపాక్ష సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఎస్విసిసి బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడిగా నటిస్తుంది. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ ను ఈ నెల 24న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేయబోతునట్టు అఫీషియల్ మూవీ టీం పోస్టర్ రిలీజ్ చేసింది.

అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ్ అర్జున్ వర్మ అనే పాత్రలో ఇంటర్నేషనల్ స్పై గా కనిపించబోతున్నాడు. అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో బారి అంచనాలున్నాయి. ఇక ఇటీవలనే వరుణ్ తేజ్ కు లావణ్య త్రిపాఠికి నిశ్చితార్థం కాగా పెళ్లి మాత్రం ప్రస్తుతం వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాల షూటింగ్స్ అన్నీ కంప్లిట్ చేసిన తరువాతనే చేసుకోబోతున్నారని టాక్.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు