Suriya: కంగువ టీజర్ అప్డేట్

వెర్సటైల్ యాక్టర్ సూర్య హీరోగా వస్తోన్న మోస్ట్ యాన్టిస్పెటెడ్ చిత్రం కంగువ. స్టూడియో గ్రీన్ సంస్థ మరియు యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమాకి సంబంధిచిన గ్లిమ్స్ వీడియో డేట్ ను కాసేపటి క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది మూవీ టీం .

డైరెక్టర్ శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాని 10 భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా తొందరలోనే మూవీ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు

1678 లోని ఒక మరాఠా యోధుడి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పిఎస్ టూ సినిమా తరువాత తమిళ్ ఇండస్ట్రీ నుంచి వస్తోన్న అతి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇదే. సూర్య హీరోగా వస్తోన్న మొదటి పాన్ ఇండియన్ సినిమా అవడంతో ఏ విషయం లోను తగ్గకుండా చాలా జాగత్తగా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

ఇక ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోను జులై 23న విడుదల చేయబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇప్పటికే షూటింగ్ దాదాపు చివరి దశకి చేరుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే జులై 23 గ్లిమ్స్ వీడియో అని డేట్ ప్రకటించిన మూవీ టీం, టైం ను మాత్రం మెన్షన్ చేయకపోవడం గమనార్హం .

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు