Heroine Tamannaah: పాలసీ బ్రేక్… ఒక్కసారిగా కెరీర్ టర్న్ అయిందే!

Heroine Tamannaah

హీరోయిన్ తమన్నా భటాయా… ప్రస్తుతం ఎక్కువ రోజులు ట్రెండింగ్ లో ఉంటున్న హీరోయిన్. కొన్ని రోజుల క్రితం, తమన్నా కెరీర్ ముగిసిపోయిందని, యంగ్ హీరోయిన్లకు పోటీ ఇవ్వలేకపోతుందని, ఇక అవకాశాలు దక్కడం ఖష్టమే అంటూ తెగ వార్తలు వచ్చాయి. అందరూ అనుకున్నట్టే సైరా సినిమా తర్వాత తమన్నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. తమిళలో చిన్న చిన్న సినిమాలు వచ్చినా, అవి పెద్దగా ఆడలేదు. చివరికి ఐటెం సాంగ్స్ చేసుకునే పరిస్థితికి వచ్చేసింది.

అలా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. అయినా, ఈ మిల్క్ బ్యూటీ అవకాశాలు వచ్చియా అంటే? రాలేదనే చెప్పొచ్చు. దీని తర్వాత ఉమెన్ సెంట్రిక్ మూవీలు అంటూ ఓ ప్రయోగం కూడా చేసింది. అది కూడా పెద్దగా ఫలితం ఇవ్వలేదు. ఇలాంటి ప్రయోగాలు ఇక కుదురవు అని అనుకుని 18 ఏళ్లుగా ఫాలో అవుతున్న నో కిస్సింగ్ పాలసీకి బ్రేక్ వేసి, బోల్డ్ పాత్రలు చేయడానికి రెడీ అయిపోయింది. అ కోవాలో వచ్చినవే జీ కర్దా వెబ్ సిరీస్, లస్ట్ స్టోరీస్2 మూవీ.

జీ కర్దా మూవీలో హీరోయిన్ తమన్నా తన నో కిస్సింగ్ పాలసీని మొదటిసారి బ్రేక్ చేసింది. ఈ సిరీస్ చేసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. దీనిపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. అవకాశాల కోసం ఇలా చేస్తోంది అంటూ ట్రోల్స్ కూడా వచ్చాయి. అయినా తమన్నా, ఏ మాత్రం తగ్గకుండా అదే తరహాలో లస్ట్ స్టోరీస్ 2 చేసింది. ఈ రెండింటిలో తమన్నా బోల్డ్ సీన్స్ చేసింది. అయినా, వీటికి రెస్పాన్స్ బాగా వచ్చింది.

- Advertisement -

దీంతో హీరోయిన్ తమన్నా చేస్తున్న ప్రతి సినిమాలో రెచ్చిపోవడానికి సిద్దమైంది. మిల్క్ బ్యూటీ ప్రస్తుతం రజినీకాంత్ తో జైలర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవల కావాలయా… అనే సాంగ్ వచ్చింది. ఈ సాంగ్ లో తమన్నా డ్యాన్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. అలాగే తమన్నా మరోసారి దర్శక నిర్మాతల కంట పడుతుంది. తాజాగా ఈ మిల్క్ బ్యూటీకి మరో క్రేజీ ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది.

కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ విడాముయిర్చి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ముందుగా విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాల్సింది. కానీ, కొన్నికారణాల వల్ల లైక ప్రొడక్షన్స్, హీరో అజిత్ డైరెక్టర్ ను మార్చారు. ప్రస్తుతం ఈ మూవీకి మగిళ్ తిరుమేణి దర్శకత్వ బాధ్యతలు చేస్తున్నారు. అయితే ఈ మూవీలో ముందుగా త్రిషను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ, త్రిష లియో షూటింగ్ లో బిజీ ఉండటం వల్ల, విడాముయిర్చి వాయిదా పడుతూ వస్తుంది.

దీంతో మూవీ టీం హీరోయిన్ ను మార్చాలని డిసైడ్ అయిందని టాక్ వినిపిస్తుంది. త్రిష ప్లేస్ లో ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న మిల్క్ బ్యూటీని ఎంపిక చేయాలని చర్చలు జరుగుతన్నట్టు కోలీవుడ్ లో గుస గుసలు వినిస్తున్నాయి. ఒక వేళ ఇది నిజమే అయితే, ఒక స్టేజ్ లో అవకాశాలు రాక ఐటెం సాంగ్స్ చేసుకున్న తమన్నా మరోసారి బిజీ హీరోయిన్ గా మారిపోతుందని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. కాగా, అజిత్ – తమన్నా కాంబినేషన్ లో ఇది వరకే వచ్చిన వీరం మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు అన్ని సెట్ అయితే ఈ కాంబో మరోసారి సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ చేయనుంది.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు