Theri: కీర్తి సురేష్ సంచలన నిర్ణయం?

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పినంత తక్కువ అవుతుంది.’నేను శైలజ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్ తెలుగు తనంతో కూడిన అభినయంతో ప్రేక్షకులను మాయ చేసింది. ‘మహానటి’తో ప్రేక్షకుల గుండెల్లో కుర్చీ వేసుకుని కూర్చుంది. ఈ సినిమా విజయంతో కీర్తి సురేష్ కు అవకాశాలు క్యూ కట్టాయి.

కీర్తి కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేది. కానీ అక్కడే ఆమె పెద్ద పొరపాటు చేసింది. అవకాశాలు వస్తున్నాయి కదా అని కథల గురించి ఆలోచించకుండా సినిమాలను చేసింది. అవి కాస్త ఫ్లాప్ లుగా నిలిచాయి. చాలాకాలం తర్వాత సాని కాదియం, సర్కారు వారిపాట వంటి వరుస హిట్లతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. ఇక ఈ ఏడాది వచ్చిన ‘దసరా’తో తిరుగులేని విజయం సాధించింది. ఇప్పుడు వరుస ఆఫర్లు కొట్టేస్తోంది.

ఇక తాజాగా కీర్తి తన మొట్టమొదటి బాలీవుడ్ చిత్రాన్ని సైన్ చేసినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ భారీ హిట్ చిత్రం ‘తేరి’ హిందీ రీమేక్ లో యంగ్ హీరో వరుణ్ దావన్ జోడిగా నటించనుందని టాక్. అయితే ఈ మూవీని తమిళలో అట్లీ తెరకెక్కించగా… ఇప్పుడు హిందీ రీమేక్ ను ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి దర్శకుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు