Extra ordinary man: భారీ నష్టాల్ని మిగిల్చనున్న నితిన్ సినిమా..?

టాలీవుడ్ లో లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ కూడా ఒకటి. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాను వక్కంతం వంశీ డైరెక్ట్ చేయగా, శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 8న రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ నుండి రొటీన్ సినిమా అన్న టాక్ ని మూట గట్టుకోగా, కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా అవడంతో ఓపెనింగ్స్ బాగా వస్తాయని అందరూ అనుకున్నారు.

కానీ రిలీజ్ అయిన ఫస్ట్ డే ప్రీమియర్స్ కే సినిమా బ్యాడ్ టాక్ బాగా స్ప్రెడ్ అవడంతో దారుణమైన ఓపెనింగ్స్ ని తెచ్చుకుంది. అయితే వీకెండ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతో కనీసం ఓపెనింగ్స్ అయినా వస్తాయని భావించిన బయ్యర్ల ఆశలు అడియాశలయ్యాయి. ఇక ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ రిలీజ్ అయిన మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 3.86 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది.

అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 25 కోట్ల బిజినెస్ చేయగా, 25.50 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం మరో 21.20 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టాలి. కానీ పరిస్థితి చూస్తుంటే థియేటర్ల వద్దకు బీసీ ఆడియన్స్ కూడా దగ్గరకు రావట్లేదు. దాంతో సినిమా భారీ నష్టాలని బయ్యర్లకి మిగిలుస్తుందని తెలుస్తుంది. వర్కింగ్ డేస్ లో మహా అయితే సినిమా మరో కోటి రూపాయల వరకు రాబట్టొచ్చు.

- Advertisement -

ఫస్ట్ వీక్ ముగిసే లోపు ఇక థియేటర్ల నుండి తీసేయడమే అన్నట్టు ఉంది. దీన్ని బట్టి బయ్యర్లకి 20 కోట్ల వరకు సినిమా భారీ నష్టాలని మిగిల్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఎండ్ అయ్యే సరికి ఈ ఆర్డినరీ మ్యాన్ ఎంత రాబడతాడో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు