Sri Ram: ‘పిండం’ లో అంత భయానకం దాగుందా?

టాలీవుడ్ లో గత వారం రిలీజ్ అయిన చిత్రాల్లో ‘హాయ్ నాన్న’ మంచి ప్రేక్షకాదరణ తో దూసుకుపోతుండగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. అయితే సలార్ వల్ల ఈ వారం రిలీజ్ అవ్వాల్సిన చాలా సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. అయితే కొన్ని చిన్న సినిమాలు మాత్రం ధైర్యం చేసి ముందుకువచ్చాయి. అందులో “పిండం” ఒకటి. ఈ సినిమా ఒక హర్రర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఘోస్ట్ మూవీ.

నిజానికి ఈ సినిమాపై ముందు అంచనాలు లేకున్నా, ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత సినిమాపై హైప్ పెరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చిన ‘మసూద’ సినిమాలా ఒక హర్రర్ కాన్సెప్ట్ తో వస్తుంది. ట్రైలర్ లో కథ చూడ్డానికి సింపుల్ గా ఉన్నా, డైరెక్టర్ తన స్క్రీన్ ప్లే తో సినిమాపై మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరెన్స్ ని కలుగచేస్తాడని అనిపిస్తుంది.

ఇక లేటెస్ట్ గా ఈ సినిమాని సెన్సార్ కి పంపగా, అక్కడ సెన్సార్ వాళ్ళు క్లీన్ A సర్టిఫికెట్ ఇచ్చారు. దీన్ని చిత్ర యూనిట్ అనౌన్స్ చేయగా, అందులో ‘ప్రెగ్నెంట్ లేడీస్’ కి సినిమా చూసే అనుమతి లేదని చెప్పడం జరిగింది. అంటే సినిమాలో అంత హర్రర్ దాగుందా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పైగా సినిమా ఉప శీర్షిక లో ” ది స్కేరియెస్ట్ మూవీ ఎవర్” అని కూడా మెన్షన్ చేసారు. అంటే ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ఎక్కువ భయానక సినిమా ఇదేనని మేకర్స్ చెప్పడం జరిగింది.

- Advertisement -

ఇక పిండం సినిమాలో శ్రీ రామ్ మెయిన్ లీడ్ గా నటించగా, అవసరాల శ్రీనివాస్, ఖుషీ రవి, ఈశ్వరి రావు, రవి వర్మ కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ 15న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మరి సినిమాలో ఎంత వరకు థ్రిల్లర్ ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు