Devil Movie: కళ్యాణ్ రామ్ అన్ హ్యాపీ… అభిషేక్ మొత్తం నాశనం చేశాడా?

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ “డెవిల్ “. ఈ మూవీ పట్ల హీరో సంతోషంగా లేడా? ఈ మూవీ విషయంలో అసలు ఏం జరుగుతుంది? అనే వివరాల్లోకి వెళితే…

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “డెవిల్ “. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే సబ్ టైటిల్ తో వస్తున్న స్పై థ్రిల్లర్లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ పీరియాడికల్ స్పై థ్రిల్లర్ మూవీలో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ ప్రత్యేకమైన పాత్రను పోషించబోతున్నారు. 1940 లలో ఇండియాలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ తెరకెక్కిన ఈ పీరియాడికల్ డ్రామాలో మాళవిక నాయక్ కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. టీజర్ తోనే థ్రిల్లింగ్ సినీమాటిక్ ఎక్స్పీరియన్స్ రావడంతో సినిమాపై భారీ హైప్ పెరిగింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మేకర్స్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

నిజానికి మొదటి నుంచి ఈ సినిమా వివాదాస్పదమవుతూ వస్తోంది. “డెవిల్ ” మూవీకి ముందుగా నవీన్ మేడారం దర్శకత్వం వహించారు. అయితే నిర్మాత అభిషేక్ నామాకి, దర్శకుడు నవీన్ కి మధ్య విభేదాలు రావడం సినిమాపై చాలా నెగటివ్ వేవ్ తీసుకొచ్చింది. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్లలో అభిషేక్ నామ డైరెక్టర్ గా ఏకంగా తన పేరునే వేసుకోవడం మరో వివాదానికి దారితీసింది. విభేదాల కారణంగా డెవిల్ సినిమాకు ముందుగా సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ నవీన్ మేడారంని తప్పించి, డిఓపి సౌందర్ రాజన్ తో మిగతా సినిమాను పూర్తి చేయించి, డైరెక్టర్ గా తన పేరు వేసుకున్నారు నిర్మాత అభిషేక్ నామా.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే డెవిల్ సినిమా విషయంలో కళ్యాణ్ రామ్ సంతోషంగా లేడనే వార్త ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వివాదాలు అన్నింటికి దూరంగా ఉండాలని కళ్యాణ్ రామ్ నిర్ణయించుకున్నాడని, అందుకే అతను ఏ మాత్రం స్పందించట్లేదని అంటున్నారు. అంతేకాకుండా తాజాగా మేకర్స్ డిసెంబర్ 29న డెవిల్ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. అయితే కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు సంబంధించిన కొత్తగా రిలీజ్ డేట్ పోస్టర్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇక్కడే కళ్యాణ్ రామ్ అసంతృప్తిగా ఉన్నాడు అనే విషయం అర్థం అవుతోంది. అయితే Filmifyకి అందుతున్న ఎక్స్ క్లూజివ్ సమాచారం ప్రకారం డైరెక్టర్ నవీన్ విషయంలో నిర్మాత అభిషేక్ వ్యవహరించిన తీరు కళ్యాణ్ రామ్ కి ఏమాత్రం నచ్చలేదని, సినిమా అవుట్ పుట్ కూడా చాలా బ్యాడ్ గా వచ్చిందని, అందుకే కళ్యాణ్ రామ్ ఈ మూవీ విషయంలో హ్యాపీగా లేడని తెలుస్తోంది. దీంతో అసలు కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ ని ప్రమోట్ చేస్తాడా? లేదంటే సినిమా నుంచి దూరంగా ఉంటాడా ? అనేది వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు