Guntur kaaram:” ఓ మై బేబీ” అంటున్న మహేష్.. మెలోడీ సాంగ్ ప్రోమో అదుర్స్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయడానికి సన్నహాలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలను శరవేగంగా చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే మొన్నటికి మొన్న ఈ సినిమా నుంచి “దమ్ మసాలా” పాటను రిలీజ్ చేయగా.. ఇప్పుడు” ఓ మై బేబీ “అంటూ సాగే ఒక పాట ప్రోమో ని నేడు రిలీజ్ చేయడం జరిగింది.

ఈ పాటకి ముందు మహేష్, శ్రీ లీల మధ్య ఒక చిన్న సంభాషణని కూడా రిలీజ్ చేశారు.. మహేష్ బాబు ఇందులో శ్రీలీల తో మాట్లాడుతూ.. అమ్ము గుర్తుపెట్టుకో.. రావణ గాడు గుంటూరు వస్తే పనికొస్తది..”అంటూ చెప్పారు. దానికి శ్రీ లీల తనకి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఈ లవ్లీ ప్రోమో ను చూసిన ఆడియన్స్లో ఫుల్ సాంగ్ ఎప్పుడెప్పుడు చూస్తామన్న క్యూరియాసిటీ కూడా మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇక ఫుల్ పాటను డిసెంబర్ 13వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.

ఇకపోతే ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా ఈ పాటకి రామజోగయ శాస్త్రి అందించిన లిరిక్స్ ని శిల్పారావు పాడారు. మొదటి సాంగ్ మాస్ లవర్స్ ని ఆకట్టుకోగా.. ఇప్పుడు ఈ పాట మూవీ లవర్స్ ని ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ఇప్పటికే మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడో సారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడంతో ఈసారి పక్కా భారీ విజయాన్ని అందుకుంటారని అభిమానులు అనుకుంటున్నారు. మరి జనవరి 12వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఎటువంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

- Advertisement -

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు గ్లోబల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళితో అడ్వెంచర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కథ సిద్ధమైందని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారని సమాచారం. గుంటూరు కారం సినిమా తర్వాత రాజమౌళి సినిమా షూటింగ్ పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం.

 

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు