Brahmastra : తల వంచుతుందా.. నిలబడుతుందా ?

బాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్ది రోజుల నుంచి బాయ్ కాట్ ట్రెండ్ కొనసాగుతుంది. స్టార్ హీరోలు నటించిన అన్ని చిత్రాలకు బాయ్ కాట్ ట్రెండ్ తో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలుస్తున్నాయి. భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు సైతం తీవ్రంగా నష్టాన్ని చవిచూశాయి. గంగూభాయి కతియావాడి, భూల్ భూలయ్య 2 చిత్రాలు మాత్రమే ఆశించిన ఫలితాలు వసూలు చేసి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. అమీర్ ఖాన్ హీరోగా వచ్చి లాల్ సింగ్ చద్దా, రణబీర్ కపూర్ షంషేరా వంటి చిత్రాలు ఆశించిన మేరకు ఆకట్టుకోలేదు. 

ఈ చిత్రాల విడుదల  సమయంలో బాయ్ కాట్ సెగ తాకింది. ఈ రెండు చిత్రాలు డిజాస్టర్ గా మిగిలాయి. తాజాగా రేపు విడుదలవ్వనున్న బ్రహ్మాస్త్ర సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో ఈ సినిమా పై పాజిటివ్ ఒపెనియన్ ఎదురవుతున్నప్పటికీ నెట్టింట్లో మాత్రం బాయ్ కాట్ ట్రెండ్ కొనసాగుతోంది. 

మరోవైపు బ్రహ్మాస్త్ర అడ్వాన్స్ బుకింగ్ లో కూడా రికార్డు  క్రియేట్ చేస్తోంది. ఈ జంట బీఫ్ విషయంలో గతంలో చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ.. భజరంగ్ ధళ్ కార్యకర్తలు రణబీర్ కపూర్, అలియాభట్ లను  అడ్డుకున్నారు.  ముఖ్యంగా వీరు బీఫ్ తింటారని వీరిని గుడిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.  దీంతో బ్రహ్మాస్త్ర కి మరిన్ని కష్టాలు రాబోతున్నట్టు తెలుస్తోంది. బ్రహ్మాస్త్ర సినిమా గత సినిమాల మాదిరిగానే బాయ్ కాట్ ట్రెండ్ కి బలవుతుందా ? లేదా బాయ్ కాట్ నినాదాలను ఎదుర్కొని బాలీవుడ్ లో సంచలనాలను  సృష్టిస్తుందా అనేది సెప్టెంబర్ 09న తెలియనుంది. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు