Directors Wife’s: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల భార్యలు ఏం చేస్తుంటారో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది కొత్త దర్శకులు పరిచయమవుతూనే ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన డైరెక్టర్లు కూడా చాలామంది ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను తెరకెక్కిస్తూ ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంటున్న డైరెక్టర్లు కూడా ఉన్నారు. అయితే డైరెక్టర్ల భార్యలు కూడా సెలబ్రిటీలు అన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అలా టాలీవుడ్ లో కొంతమంది డైరెక్టర్ల భార్యలు ఎందుకు ఫేమస్ అయ్యారో వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1). రాజమౌళి:
తెలుగు సినీ పరిశ్రమను అమాంతం ప్రపంచవ్యాప్తానికి పరిచయం చేసిన రాజమౌళి ఈయన భార్య రమా కూడా ఆయన తెరకెక్కించే సినిమాలలో భాగంగా కాస్ట్యూమ్స్ డిజైనర్ గా చేస్తూ ఉంటుంది.

2). త్రివిక్రమ్
మాటల మాంత్రికుడిగా పేరుపొందిన త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన భార్య సౌజన్య కూడా క్లాసికల్ డాన్సరే..అంతేకాకుండా ఇటీవలే నిర్మాతగా కూడా కొనసాగుతూ పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నది.

- Advertisement -

3). సుకుమార్:
టాలీవుడ్ లో లెక్కలు మాస్టర్ గా పేరు సంపాదించిన సుకుమార్ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించారు. సుకుమార్ భార్య తబిత ఇండస్ట్రీలో రాణించకపోయిన పలు రకాల బిజినెస్ లతో వ్యాపారాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

4). కృష్ణవంశీ:
తెలుగులో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన కృష్ణవంశీ భార్య హీరోయిన్ రమ్యకృష్ణ ఈమె ఇప్పటికి అప్పటికి పలు సినిమాలలో నటిస్తూ స్టార్ పొజిషన్ ని అందుకుంది.

5). అనిల్ రావిపూడి:
ఓటమి ఎరుగని డైరెక్టర్లలో అనిల్ రావిపూడి కూడా ఒకరు.. ఈయన భార్య పేరు భార్గవి ఈమె కూడా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ కేవలం ఇంట్లో పని చేసుకుంటూ బిజీగా ఉంటుందట.

6). మణిరత్నం:
టాలీవుడ్ బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన మణిరత్నం ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఈయన భార్య సుహాసిని కూడా పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది. ఇప్పటికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటిస్తోంది.

ఇక వీరే కాకుండా చాలామంది దర్శకుల భార్యలు కూడా కేవలం ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రతి డైరెక్టర్ కూడా సక్సెస్ కావాలి అంటే అందులో తన భార్య హస్తము ఉంటుందని చెప్పవచ్చు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు