Sai dharam Tej: ఈ మెగా హీరో లవ్ ఫెయిల్యూర్ వెనుక ఇంత కథ వుందా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సుప్రీం హీరో సాయి ధరంతేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన తోటి హీరోలంతా కూడా వరుసగా పెళ్లిళ్లు చేసుకుని పిల్లాపాపలతో మంచి లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటే.. ఈయన మాత్రం అసలు పెళ్లి మీద ఆసక్తి లేనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అనేక ఇంటర్వ్యూలలో పెళ్లి టాపిక్ వచ్చినప్పుడు రియాక్షన్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇక పెళ్లెప్పుడు చేసుకుంటాడు అనే విషయం కాసేపు పక్కన పెడితే సాయి ధరంతేజ్ ఇండస్ట్రీలో ప్రత్యేకించి కొంతమంది హీరోయిన్స్ తో ప్రేమ వ్యవహారాలను చాలా బలంగానే నడిపినట్లు సమాచారం.

ముఖ్యంగా రెజీనా కసాండ్రా తో పాటు తిక్క హీరోయిన్ లర్రిస్సా తో ఈయన అప్పట్లో ఒక రేంజ్ లో ప్రేమాయణం నడిపారని అందరికీ తెలిసిందే. ఇక తర్వాత రాశి కన్నా పేరు కూడా వినిపించింది. ఇక అంతేకాదు ఆయనతో పనిచేసిన ప్రతి హీరోయిన్తో కూడా ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక అదే లిస్టులో మరో యంగ్ హీరోయిన్ మెహ్రిన్ కూడా ఉందని సమాచారం.వీరిద్దరూ కలిసి జవాన్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. అయినా ఈ సినిమాలో వీరిద్దరూ లిప్ లాక్ సన్నివేశాలలో నటించడం.. ఇద్దరి మధ్య కెమిస్ట్రీని చూసి అందరూ నిజంగానే వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అని కామెంట్లు చేశారు. ఇక ఇండస్ట్రీలో కూడా వీళ్ళ ప్రేమాయణం గురించి ఎన్నో కథనాలు ప్రచారం అయ్యాయి.

ఇక అప్పట్లో దీని నుంచి తప్పించుకోవడానికి సాయి ధరమ్ తేజ్ కూడా చాలా తెలివైన సమాధానం తెలిపారు. అంతేకాదు ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ.. అవును మెహ్రీన్ తో లవ్ ఎఫైర్ ఉంది.. సీక్రెట్ గా పెళ్లి చేసుకుని.. పిల్లల్ని కూడా కన్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక దీంతో యాంకర్ ఆశ్చర్యపోగా అప్పుడు సాయి ధరంతేజ్ మాట్లాడుతూ.. లేకపోతే ఏంటండీ.. ఎవరో ఏదో మాట్లాడితే దానిని తీసుకొచ్చి మీరు నన్ను అడుగుతారా.. అంటూ చాలా వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ వినిపించే వార్తలేమిటంటే ఇద్దరూ కలిసి పార్టీలకు, పబ్ లకు వెళ్లడం, అంతేకాదు తరచూ మెహ్రీన్ ఫ్లాట్ కి సాయి ధరమ్ తేజ్ వెళ్తూ ఉంటారని కామెంట్లు వ్యక్తం అవుతూ ఉంటాయి. ఇకపోతే ఎన్ని కామెంట్లు వినిపించినా కూడా దీనిపై మెహ్రీన్ స్పందించకపోవడం గమనార్హం.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు