Srileela: ప్రతినెల దానికోసం అలాంటి ఇంజక్షన్ తీసుకుంటున్న శ్రీ లీల..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీలీల హవా భారీగా కొనసాగుతోంది. ముఖ్యంగా ఈమె నటించిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటోంది. దీంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు ఇస్తున్నారు. ఇలాంటి క్రమంలోని శ్రీలీల కు సంబంధించి తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. వాటికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

చూడడానికి శ్రీ లీలా చాలా స్టైలిష్ గా అందంగా కుర్రకారులకు మత్తెక్కించేలా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇటీవలే కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తలు ఏమిటంటే శ్రీ లీల కొన్ని రకాల ఇంజక్షన్స్ తీసుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అవి అందం కోసం కాదు ఆరోగ్యం కోసం అన్నట్లుగా సమాచారం.. ఈమె తల్లి కూడా ఒక వైద్యురాలే. ఇక శ్రీ లీల ను కూడా ఈమె పట్టుబట్టి మరి మెడిసిన్ చదివించేలా చేస్తోంది. ఎలాంటి వాటినైనా సరే శ్రీ లీల మెడిసిన్ తో కాకుండా నేచురల్ గానే తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుందట.

కానీ ఒక విషయంలో మాత్రం శ్రీ లీల ప్రతినెల కచ్చితంగా ఇంజక్షన్లు తీసుకోవడానికి ఎక్కువ మక్కువ చూపుతోందట. ఈ ఇంజక్షన్ ఎందుకంటే ఈమె ఒక్కసారి తుమ్మిందంటే చాలు దాదాపుగా 10 నిమిషాల పాటు కంటిన్యూగా తుమ్ములు వస్తూనే ఉంటాయట దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది శ్రీ లీల. ఇందుకోసం ఎన్నో రకాల ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా ఉపయోగం లేకుండా పోతుందట. అందుకే శ్రీ లీల ఆమెకు ఎప్పుడైతే జలుబు చేసి తుమ్ములు వస్తాయో అప్పుడు కచ్చితంగా ఈ ఇంజక్షన్ ఉపయోగించుకుంటున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

కేవలం జలుబుకు మాత్రమే శ్రీ లీల ఇలా ఇంజక్షన్ తీసుకుంటుందని ఇతరత్రా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ఈమె ఇంజక్షన్ తీసుకోకుండా డైట్ ఫాలో అవుతూ నాచురల్ మెడిసిన్ తోనే వాటిని తగ్గించుకునేలా చేస్తూ ఉంటుందట శ్రీ లీల. ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, మహేష్ బాబు గుంటూరు కారం.. నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ తదితర చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. రెమ్యూనరేషన్ ని కూడా శ్రీ లీల భారీగానే పెంచేసినట్లు సమాచారం. ఒకవైపు సినిమాలు మరొకవైపు చదువుతూ బిజీగా గడిపేస్తోంది శ్రీ లీల.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు