Mega Family: సాయి ధరమ్ తేజ్ పెళ్లి ఆ హీరోయిన్ తోనే…?

సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఇంటి నుంచి వచ్చిన అనేక మంది హీరోల్లో సాయిధరమ్ తేజ్ కూడా ఒకరు. రామ్ చరణ్ తర్వాత ఎక్కువ సినిమాలు తీసిన వారసుడిగా సాయి ధరమ్ తేజ్ కి పేరు ఉంది. అయితే ఇతడికి కెరీర్ స్టార్ట్ అయ్యి దాదాపు దశాబ్దం కాలం గడుస్తుంది.

2014లో పిల్ల నువ్వు లేని జీవితం అంటూ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే సాయి ధరమ్ తేజ్ రెండేళ్ల క్రితం బైక్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో చాలా రోజుల వరకు బెడ్ పై పరిమితమైన ఆయన కోలుకున్న తర్వాత చిన్నగా సినిమాలు చేయడం ప్రారంభించారు.

అయితే సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురికావడానికి అంటే ముందు ఆయన తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారట. అంతే కాకుండా ఓ యువతిని కూడా ఎంపిక చేశారట. వాస్తవానికి సాయి ధరమ్ తేజ్ మరియు మెహరీన్ కాంబినేషన్ లో జవాన్ సినిమా వచ్చింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారట. అయితే ఈ ప్రేమకు మెగా ఫ్యామిలీ అసలు ఒప్పుకోలేదట. దీంతో వీరిద్దరూ విడిపోయినట్టు సమాచారం.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు