Director Harish Shankar : ఏడ్చుకుంటూ సెట్స్ నుంచి బయటకు…. హరీష్ శంకర్ కు అన్యాయం చేసిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

Director Harish Shankar : డైరెక్టర్ హరీష్ శంకర్ రచయిత నుంచి డైరెక్టర్ గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రామయ్యా వస్తావయ్యా సినిమా విషయంలో హరీష్ శంకర్ తో తనకున్న విభేదాలను తాజాగా బయట పెట్టి సంచలనం సృష్టించారు కెమెరా మ్యాన్ చోటా కె నాయుడు. దీంతో ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూనే సమాధానం చెప్పాడు హరీష్ శంకర్. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ హరీష్ శంకర్ కు గతంలో ఎదురైన చేదు అనుభవం గురించి చర్చ నడుస్తోంది. ఆయన ఏడ్చుకుంటూ సెట్స్ నుంచి బయటకు వెళ్లాను అంటూ కామెంట్స్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతుంది. మరి ఇంతకీ హరీష్ శంకర్ కు అన్యాయం చేసిన డైరెక్టర్ ఎవరు? అనే వివరాల్లోకి వెళితే…

ఆ డైరెక్టర్ దగ్గర రెండేళ్ళు వేస్ట్…

రచయితగా సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ను ప్రారంభించిన హరీష్ శంకర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారట. రచయితగా పని చేస్తే అసిస్టెంట్ డైరెక్టర్ గా మారే అవకాశం ఉంటుందన్న ఆశతోనే ఆయన ఇండస్ట్రీకి వచ్చారట. ఆ ఆలోచనతోనే ఓ డైరెక్టర్ దగ్గర అప్పట్లో రెండు మూడేళ్లు వేస్ట్ చేశానని హరీష్ శంకర్ ఆ వీడియోలో సంచలన కామెంట్స్ చేశారు. అయితే వేస్ట్ చేశాను అని చెప్పడం కంటే ఎక్కువగా కష్టపడ్డాను, చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పొచ్చు అంటూనే ఆయన తన విషయంలో చేసిన అన్యాయాన్ని బయట పెట్టారు.

ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా…

అప్పట్లో అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా చాలా ఎక్సైటెడ్ గా ఉదయాన్నే లేచి బీహెచ్ఈఎల్ నుంచి బస్ ఎక్కి వచ్చానని గుర్తు చేసుకున్నారు. ఇన్నాళ్లకు ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ కాబోతున్నానని ఆనందంతో అన్నపూర్ణ స్టూడియోలో అడుగు పెడితే ఆయన ఆనందం ఎక్కువసేపు నిలవలేదట. సినిమా ప్రారంభోత్సవం టైంలో టెక్నీషియన్లకు సంబంధించిన డీటెయిల్స్ తో ప్రెస్ కి ఓ లిస్ట్ ఇస్తారు. కానీ తీరా చూస్తే అందులో అసిస్టెంట్ డైరెక్టర్ గా తన పేరు లేదనే షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు హరీష్ శంకర్.

- Advertisement -

ఆ డైరెక్టర్ ఎవరంటే?

అదేంటి సంవత్సరంన్నర కష్టపడ్డాం కనీసం అసిస్టెంట్ డైరెక్టర్ గా పేరు వేయలేదు ఏంటి? అని ప్రశ్నిస్తే… వేరే ఆబ్లిగేషన్ ప్రాబ్లం వచ్చిందనీ, వేరే వాళ్ళని పెట్టుకున్నామని చెప్పాడట సదరు డైరెక్టర్. ఒక డైరెక్టర్ గా అసిస్టెంట్ డైరెక్టర్స్ ను మెయింటైన్ చేయడం ఎంత కష్టమో తనకు తెలుసని, కానీ సంవత్సరంన్నర రెండు కష్టపడి పని చేసినా రూపాయి ఇవ్వలేదని, కనీసం అసిస్టెంట్ డైరెక్టర్ గా పేరు కూడా వేయలేదనే బాధతో వెంటనే అన్నపూర్ణ స్టూడియో నుంచి ఏడ్చుకుంటూ బయటకు వెళ్లిపోయానని అప్పట్లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు హరీష్ శంకర్. అయితే ఆ డైరెక్టర్ పేరును మాత్రం ఆయన బయట పెట్టకపోవడం గమనార్హం.

కాగా ప్రస్తుతం హరీష్ శంకర్ మాస్ మహారాజా రవితేజతో కలిసి మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు