Chota K Naidu : నసగాడు… మరో డైరెక్టర్ పై బాంబ్ పేల్చిన చోటా కే నాయుడు

Chota K Naidu : టాలీవుడ్ లోని ప్రముఖ కెమెరా మ్యాన్ చోటా కె నాయుడు, డైరెక్టర్ హరీష్ శంకర్ మధ్య వివాదం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ స్టార్ కెమెరా మ్యాన్ మరో డైరెక్టర్ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసారి చోటా కె నాయుడు ఎవరి గురించి కామెంట్ చేశాడు? అనే వివరాల్లోకి వెళ్తే…

ఈసారి రాంగోపాల్ వర్మపై…

చోటా కె నాయుడు చాలా కాలం నుంచి టాలీవుడ్ లో కెమెరా మ్యాన్ గా వర్క్ చేస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఈ కెమెరా మ్యాన్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా సినిమా విషయంలో డైరెక్టర్ కు కెమెరామెన్ కన్ను లాంటి వాడు అని అంటూ ఉంటారు. వాళ్లకు 90% లైట్ ట్రావెలింగ్ గురించి తెలీదు. కాబట్టి లైటింగ్ విషయంలో కెమెరా మ్యాన్ పైనే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. అయితే ఎప్పుడైనా ఈ విషయంలో ఎవరితోనైనా ఘర్షణ జరిగిందా? అని ప్రశ్నించారు చోటాను.

దెయ్యం సినిమా టైమ్ లో మొదలు..

ఆయన స్పందిస్తూ రాంగోపాల్ వర్మతో జరిగిన గొడవలను బయట పెట్టారు. దెయ్యం సినిమా చేస్తున్నప్పుడు ఇండోర్లో షూటింగ్ జరుగుతుండగా సెట్ రెడీగా ఉందని, ఆ సమయంలో వై దట్ లైట్? స్టాప్ అంటూ రాంగోపాల్ వర్మ అన్ని లైట్లు తీసేసాడని గుర్తు చేసుకున్నారు. అయితే కోపం వచ్చినప్పటికీ ఆయన అప్పట్లో టాప్ డైరెక్టర్ కాబట్టి జస్ట్ ఒక్క లుక్ ఇచ్చి ఆయన చెప్పినట్టుగా చేశాను అని వెల్లడించారు చోటా.

- Advertisement -

అంతం సినిమాకు ఇలా..

అంతం సినిమా షూటింగ్ టైంలో కూడా నాగార్జున యాక్షన్ బ్లాక్ చేస్తున్నప్పుడు ఇలాగే జరిగిందన్నారు. ఆ సన్నివేశంలో నాగార్జున లెఫ్ట్ లో కనిపిస్తుండగా పక్కన ఇటుకలు కనిపిస్తున్నాయని, దాన్ని చూసి వర్మ నాగార్జున ఫేస్ సెంట్రల్ లో కావాలి అని అడిగారన్నారు. నాగార్జున ఫేస్ ను స్ట్రైట్ గా చూడాలి అని వర్మ చెప్పారట. ఆ టైంలో కూడా మళ్లీ కోపం రాగా, సరేలే నసగాడు అనుకుంటూ అతను చెప్పినట్టే చేశానని వెల్లడించారు చోటా. ఆ తర్వాత గోవింద గోవింద మూవీ చేద్దాం అనుకున్నప్పుడు శ్రీదేవి వేరే కెమెరా మ్యాన్ ను రికమెండ్ చేసిందని, దాంతో తాను అలిగి మాట్లాడటం మానేసానని చెప్పుకొచ్చారు చోటా.

ఆర్జీవికి ఛోటా కండిషన్..

ఆ తర్వాత కొన్నాళ్లకు చోటా మనం చిరంజీవి సినిమా చేస్తున్నాం, నువ్వే కొరియోగ్రాఫర్ అంటూ రాంగోపాల్ వర్మ ఫోన్ చేశారట. అలిగి అప్పటికే అతనితో మాట్లాడటం మానేసిన చోటా చిరు సినిమా అనేసరికి తన డ్రీమ్ నెరవేరుతుంది అనే ఆలోచనతో రాంగోపాల్ వర్మకు కండిషన్ పెట్టారట. మీ సినిమాలు డార్క్ షేడ్ లో ఉంటాయి. కానీ చిరంజీవి కమర్షియల్ హీరో. నా లైటింగ్ లో వేలు పెడితే ఒప్పుకోను అన్నాడట చోటా. దీంతో వర్మ నువ్వు కథ వినకుండా ఇవన్నీ ఎందుకు చెప్తున్నావ్ అని ప్రశ్నించారట. ఆయనంటే అభిమానం కాబట్టి అని చోటా ఆన్సర్ ఇవ్వగా, సరేలే ఏదో ఒకటి అంటూ వర్మ ఒప్పుకున్నారు అనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చోటా బయట పెట్టారు. తాజాగా హరీష్ శంకర్ తో చోటా వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ వీడియో కూడా వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు