Ratnam Movie Telugu Review and Rating : రత్నం మూవీ రివ్యూ రేటింగ్

Ratnam Movie Telugu Review and Rating : విశాల్ – హరి కాంబినేషన్లో ‘భరణి’ ‘పూజా’ వంటి హిట్ సినిమాల తర్వాత రూపుదిద్దుకున్న చిత్రం ‘రత్నం. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్స్ వంటివి ప్రేక్షకులని ఆకట్టుకోలేదు. కేవలం మౌత్ టాక్ పై డిపెండ్ అయ్యి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి :

కథ :

రత్నం (విశాల్) ఓ అనాధ. అయితే చేరదీసి పెంచిన ఎమ్మెల్యే పన్నీర్ స్వామి(సముద్ర ఖని) కి నమ్మకంగా ఉంటూ.. తన ఊరిలో జనాలకి ఏ సమస్య వచ్చినా అండగా నిలబడుతుంటాడు. పన్నీర్ స్వామిని రత్నం మావయ్య అని పిలుస్తూ ఉంటాడు. అయితే ఒకసారి రోడ్డు పై మల్లిక (ప్రియా భవానీ శంకర్) అనే అమ్మాయిని చూసి ఆమెను ఫాలో చేస్తాడు రత్నం. అదే టైంలో కొంతమంది రౌడీలు ఆమెను చంపాలని చూస్తుంటారు. వాళ్ళని పంపింది తమిళనాడు బోర్డర్లో ఉండే లింగం (మురళీ శర్మ) బ్రదర్స్. ఒక ఫైట్ చేసి మల్లికని కాపాడిన తర్వాత.. ఆమెతో ఉంటూ ఆమెను లింగం బ్రదర్ ఎందుకు చంపాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటాడు. ఇదే టైంలో మల్లికతో పాటు ఆమె ఊరికి వెళ్తాడు? ఆ తర్వాత రత్నం కి అతని ఫ్యామిలీ గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి? అసలు రత్నం ఎవరు? మల్లికని ఎందుకు కాపాడాలి అనుకుంటున్నాడు? చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

దర్శకుడు హరి సినిమాల్లో కొత్తదనం ఏమీ ఉండదు. అతను కూడా మన బోయపాటి టైపే.కాదు కాదు.. పదిమంది బోయపాటిలని కలిపితే హరి అని చెప్పాలి. మాస్ ఆడియన్స్ మెచ్చే సీన్లు పెట్టేసి.. సినిమా మొత్తాన్ని యాక్షన్ బ్లాక్స్ పెట్టేస్తూ ఉంటాడు. ప్రతి సీన్ పరిగెడుతూ ఉంటుంది. ‘రత్నం’ లో కూడా కొత్తదనం ఏమీ ఉండదు. ‘మనం’ సినిమా పాయింట్ ని తీసుకుని.. దానికి ‘పంజా’ టైపు కథనంతో.. ‘అదుర్స్’ తరహా బ్యాక్ స్టోరీతో ముగించినట్టు ఉంటుంది ‘రత్నం’. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కూడా క్లైమాక్స్ వరకు పర్వాలేదు అనిపించే విధంగా ఎంగేజ్ చేస్తుంది. కానీ క్లైమాక్స్ మాత్రం గజిబిజి గందరగోళానికి గురిచేస్తుంది. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఇలా ఎందులోనూ కొత్తదనం కనపడదు. నిర్మాణ విలువలు కూడా గొప్పగా ఏమీ ఉండవు. చాలా వరకు ఒక్కటే లొకేషన్లో సినిమాని చుట్టేశారు.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే.. విశాల్ బాగానే నటించాడు. యాక్షన్ సీన్స్ లో తన హార్డ్ వర్క్ కనిపించింది. కానీ అతని డబ్బింగ్ విషయంలో ఏదో తేడా కొట్టింది. ‘పడుకో అనడానికి పడికో..’ అంటూ అతని డైలాగ్స్ తేడా తేడాగా ఉంటాయి. ప్రియా భవానీ శంకర్.. లుక్స్ పరంగానే కాదు నటనతో కూడా మెప్పించింది. ఈ మధ్య కాలంలో ఈమె చేసిన సినిమాలతో పోలిస్తే.. ఇందులో ఆమె పాత్ర చాలా బాగుంది అని చెప్పొచ్చు. యోగిబాబు , రాజేంద్రన్..ల కామెడీ అక్కడక్కడా నవ్విస్తుంది. జయప్రకాశ్ .. హీరోయిన్ తండ్రి పాత్రలో పర్వాలేదు అనిపిస్తారు. విజయ్ కుమార్ హీరోయిన్ తాత పాత్రలో కనిపించాడు అంతే.. నటించింది అంటూ ఏమీ లేదు. సముద్రఖని సపోర్టింగ్ రోల్ బాగానే చేశాడు. సీనియర్ నటి తులసి ఓకే అనిపించింది. మురళీ శర్మ బాగానే నటించాడు కానీ అతనికి ఆ పాత్ర సెట్ అవ్వలేదు అనే చెప్పాలి. మిగిలిన వాళ్ళు ఓకే అనిపించేలా చేశారు.

ప్లస్ పాయింట్స్ :

విశాల్
ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్ :

క్లైమాక్స్
రొటీన్ కథ, రొటీన్ స్క్రీన్ ప్లే

మొత్తంగా… రెండు వారాలుగా బాక్సాఫీస్ వద్ద సందడి చేసే సినిమా లేదు. కనీసం థియేటర్ కి వెళ్లి చూడాలి అని ఆకర్షించే సినిమా కూడా రాలేదు. విశాల్ కి మాస్ సెంటర్స్ లో క్రేజ్ ఉంది కాబట్టి.. ‘రత్నం’ వారిని ఆకర్షించి థియేటర్ కి రప్పిస్తుందేమో కానీ అలరిస్తుంది అని కచ్చితంగా చెప్పలేం.

రేటింగ్ : 2 /5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు