Dev Mohan : దుష్యంతుడు వచ్చేశాడు..

సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటుంది. రెగ్యూలర్ సినిమాలతో పాటు లేడి ఓరియంటెడ్ సినిమాలను కూడా చేస్తుంది. ఇప్పటికే యూటర్న్, ఓ బేబీ లాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో తన టాలెంట్ ను సమంత చూపించింది. ఇక ఈమె మొదటిసారి ఓ పౌరాణిక పాత్రలో కనిపించడానికి రెడీ అవుతుంది. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా లేడి ఓరియెంటెడ్ చిత్రం “శాకుంతలం”. ఈ చిత్రంలో టైటిల్ రోల్ ను పోషిస్తున్నారు సమంత.

గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో పీరియాడికల్ స్టోరీ తో వస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే కొన్ని వారాలుగా ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్స్ ఏం రాలేదు. దీంతో ఏదైనా అప్డేట్ ఇవ్వాలంటూ అభిమానుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో నీలిమ గుణ సినిమా కు సంబంధించిన అప్డేట్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఆదివారం దేవ్ మోహన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. అతను అడవిలో గుర్రపు స్వారీ చేస్తున్న రాజాగా ఈ పోస్టర్లో కనిపించాడు. ఈ పాత్ర పేరు దుష్యంతుడు అని మూవీ టీం అనౌన్స్ చేశారు. దీంతో ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు అర్థమైంది. అలాగే ఈ సినిమాలో అనన్య నాగళ్ళ తో పాటు అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిఇలా ఉండగా ఈ మూవీ విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు