Varun Tej : అభినంద‌న్ వీరత్వంతో..

టాలీవుడ్ యంగ్‌ హీరో వ‌రుణ్ తేజ్ ఇటీవ‌లే న‌టించిన ఎఫ్‌-3 స‌క్సెస్‌తో మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ మెగా ప్రిన్స్ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం వరుణ్ కెరీర్ లో 12వది. దీని తర్వాత మరో సినిమా చేయడానికి వరుణ్ తేజ్ రెడీ అయిపోయాడు. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. “యుద్ధాన్ని ఆకాశంలో చూసేందుకు సంసిద్ధం అవ్వండి త్వ‌ర‌లో టేక్ ఆఫ్ అవుతుంది” అంటూ వ‌రుణ్ తేజ్ వెనుక నుంచి యుద్ధ విమానాల వైపు న‌డుస్తున్న ప్రీ లుక్  విడుద‌ల చేశారు.

ఇవాళ ఈ సినిమాకి సంబంధించి వివ‌రాలు వెల్ల‌డించారు. పూజా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ముఖ్య అతిథిగా దిల్ రాజు హాజ‌ర‌య్యారు. డైరెక్ట‌ర్ శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ హ‌డా ద‌ర్శ‌క‌త్వంలో త‌న త‌రువాత సినిమా చేయ‌నున్న‌ట్టు వ‌రుణ్ తేజ్ ప్ర‌క‌టించాడు. అయితే ఈ ద‌ర్శ‌కుడికి ఇదే తొలి సినిమాగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్స్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్‌, రిసైనెన్స్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తూ.. అవ‌ధులు లేని ధైర్య సాహ‌సాలు, శౌర్యాన్ని చూపే ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్.. ఆకాశంలో జ‌రిపే యుద్ధాన్ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు సిద్ధంగా ఉండండి అని ఓ ట్వీట్ కూడా చేశాడు వ‌రుణ్ తేజ్‌.

వ‌రుణ్ న‌టించేది అభినంద‌న్ వ‌ర్థ‌మాన్ పాత్ర‌లోని సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. సినిమా ప్ర‌క‌ట‌న త‌రువాత మాత్రం తెలుగు, హిందీ బై లింగ్యువ‌ల్ సినిమాగా రూపొందిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నేప‌థ్యంలో అభినంద‌న్ వ‌ర్థ‌మాన్ పాకిస్తాన్ ఆర్మీ చేతికి చిక్కి త‌రువాత మ‌ళ్లీ భార‌త్ తిరిగి వ‌చ్చిన విష‌యం విధిత‌మే. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాష‌ల్లో ఏక‌కాలంగా రూపొందించి 2023లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం న‌వంబ‌ర్ నుంచి సెట్స్ మీద‌కు వెళ్లే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు