Dasara: పాపం నాని.. భారీ ఆశలు పెట్టుకున్న సినిమాపై ఐపీఎల్ ఎఫెక్ట్

నేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను బేస్ చేసుకునే ఉంది. నాని నుంచి ఇటీవల వచ్చిన ‘శ్యామ్ సింగ రాయ్’ సూపర్ హిట్ కాగా, అంటే సుందరానికి చిత్రం పాజిటివ్ రివ్యూలను అయితే తెచ్చుకుంది. కానీ, కమర్షియల్ గా మాత్రం హిట్ కాలేక పోయింది. ఇప్పుడు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. అదే దసరా. ఈ చిత్రం మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అందుకు భారతదేశ వ్యాప్తంగా ఫుల్ జోష్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఈ సినిమా మొదటి రోజే 30 నుంచి 40 కోట్ల వరకు కలెక్షన్లు రావాలని చిత్ర యూనిట్ టార్గెట్ పెట్టుకుందని టాక్. సినీ క్రిటిక్స్ కూడా దసరా చిత్రానికి ఓపెనింగ్స్ 30 కోట్లు రావడం దాదాపు ఖాయమే అని అంచనా వేస్తున్నారు. మొదటి రోజు నానికి అనుకూలంగా ఉన్నా, తర్వాత నుంచి మాత్రం దసరా హవా తగ్గుతుందేమో అనే భయం చిత్ర యూనిట్ కి ఉంది. ఎందుకంటే, మార్చి 31 నుంచి భారతదేశంలో ఉన్న అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న IPL 2023 స్టార్ట్ కానుంది.

మొదటి మ్యాచ్ ఢిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ రెండు టీంలకు అన్ని రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. దీంతో ఈ రోజు దసరా చిత్రం కంటే, ఈ మ్యాచ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉంది. దీని తర్వాత ఏప్రిల్ 2వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉంది. అది కూడా ఉప్పల్ లో జరగబోతుంది. ఇది కూడా దసరా షోలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఐపీఎల్ మ్యాచ్ లు ఉంటాయి. ఈ సారి ఐపీఎల్ ఆడియన్స్ కు ఎలాంటి కరోనా నిబంధనలు లేవు. కాబట్టి, ఎక్కువ మంది మ్యాచ్ లకు వెళ్తారు. ఇది దసరా షోలపై, కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపనుందని క్రిటిక్స్ భావిస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు