RC15 :రామ్ చరణ్ బర్త్ డే రోజు అసంతృప్తి తో ఉన్న మెగాభిమానులు

మార్చి 27.. మెగా అభిమానులందరికీ ఒక పండగ లాంటి రోజు. నేడు మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా రామ్ చరణ్ బర్త్ డే వచ్చింది కదా, దీనిలో కొత్తేమీ ఉంది అనుకుంటున్నారా? ఉంది. ఎందుకంటే, ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ కు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు వచ్చింది. దీంతో చరణ్ సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా సినీ లవర్స్ అంచనాలు ఉన్నాయి. అలాగే చరణ్ ప్రస్తుతం భారతీయుడు, రోబో లాంటి భారీ సినిమాలను తెరకెక్కించిన శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. అలాగే శంకర్ – రామ్ చరణ్ కాంబోలో వస్తున్న RC15 నుంచి ఏదో ఒక అప్డేట్ రాకపోదా అని కూడా మెగా ఫ్యాన్స్ ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నారు.

అందరూ అనుకున్నట్టే RC15 నిర్మాత దిల్ రాజు.. అప్డేట్ గురించి చెప్పేశారు. మార్నింగ్ ఒక అప్డేట్.. ఈవినింగ్ మరో అప్డేట్ ఉంటుందని చెప్పాడు. దీంతో రామ్ చరణ్ పుట్టిన రోజు అయిన మార్చి 27 కోసం చరణ్ అభిమానులతో పాటు మెగా ఫ్యాన్స్ అందరూ ఎదురుచూశారు. తాజాగా RC15 టైటిల్ రివీల్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇది అభిమానులకు మింగుడుపడటం లేదు.

కొన్ని రోజుల క్రితం RC15 కి CEO అనే టైటిల్ ఖరారు అయినట్టు రూమర్స్ వచ్చాయి. దానికి ముందు సేనాని, సర్కారోడు వంటి టైటిల్స్ కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఈ మూడు టైటిల్స్ కూడా అభిమానులకు తెగ నచ్చాయి. కానీ, ఇప్పుడు అధికారికంగా వచ్చిన గేమ్ ఛేంజర్ టైటిల్ ఫ్యాన్స్ కు ఏ మాత్రం నచ్చడం లేదు. దీనిపై ఇప్పటికే అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని చెప్పేస్తున్నారు.

- Advertisement -

రాత్రికి రాత్రి ఓ టైటిల్ ను ఫిక్స్ చేసి, డిజైన్ చేసి వదిలారా ? అంటూ డైరెక్టర్ శంకర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే ఈ టైటిల్ శంకర్ రేంజ్ కు తగినట్టు లేదని కామెంట్స్ చేస్తున్నారు. రూమర్స్ లో వచ్చిన CEO టైటిల్ చరణ్ కు సూపర్ గా సెట్ అవుతుందని, అది RRR రేంజ్ లో ఉందని అంటున్నారు. గేమ్ ఛేంజర్ ను CEO గా మార్చాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు