Chiranjeevi: నాగబాబుని చితకబాదిన చిరు.. కారణం..?

Chiranjeevi.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంత గుర్తింపు ఉందో.. మెగా బ్రదర్స్ కి అంతే గుర్తింపు ఉంది. చిరంజీవి, నాగబాబు,పవన్ కళ్యాణ్ బంధం గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముగ్గురిలో ఏ ఒక్కరిని విమర్శించినా సరే మిగిలిన ఇద్దరూ తట్టుకోలేరు.. ఈ ముగ్గురి మధ్య ఎన్ని అభిప్రాయ బేధాలు ఉన్నప్పటికీ అన్నదమ్ముల అనుబంధం విషయంలో ఏమాత్రం తేడాలు ఉండవు.. అందుకే తమ మధ్య ఎలాంటి విభేదాలు వచ్చినా.. వాటిని పట్టించుకోకుండా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ అన్నదమ్ములు. అయితే ఇదిలా ఉండగా ఒకసారి చిరంజీవికి నాగబాబు పై బాగా కోపం వచ్చి.. గట్టిగా కొట్టారట.ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి తెలపడం గమనార్హం.

నాగబాబుని చితకబాదిన చిరంజీవి..
చిరంజీవి ఈ విషయంపై మాట్లాడుతూ.. నేను సినిమాల్లోకి రాకముందు జరిగిన సంఘటన ఇది.. ఒకరోజు నేను ఇంటర్ చదువుతున్న సమయంలో నాగబాబు ఏడవ తరగతి చదువుతున్నారు. ఆ సమయంలో ఇంటిలో చిన్న చిన్న పనులన్నీ నేనే చేస్తూ వచ్చేవాడిని.. ఈ క్రమంలోని ఒకరోజు ఒకే సమయంలో రెండు పనులు చేయవలసి వచ్చింది.. వాటిలో ఒక పనిని నాగబాబుకి అప్పజెప్పాను.. అదేమిటంటే లాండ్రీ దగ్గరకు వెళ్లి బట్టలు తీసుకురా అని నాగబాబుకి చెప్పాను.. నేను బయటకు వెళ్లి మరో పనిని పూర్తిచేసుకుని వచ్చాను.. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నాగబాబుని బట్టలు తెచ్చావా? అని అడిగితే.. తీసుకురాలేదు అని చెప్పాడు..ఎందుకు తీసుకురాలేదు? అని నేను ప్రశ్నిస్తే.. నిద్రపోయాను అంటూ బదులిచ్చారు. దాంతో విపరీతమైన కోపం వచ్చి నాగబాబుని పట్టుకుని గట్టిగా కొట్టాను.. అయితే నాగబాబుని అలా కొట్టడం చూసిన మా అమ్మ నన్ను బాగా తిట్టారు.. అమ్మ కూడా నన్నే తిట్టడంతో మరింత కోపం వచ్చింది. దీంతో సాయంత్రం నాన్న వచ్చిన తర్వాత ఏడుస్తూ జరిగిందంతా చెప్పాను.. అది విన్న మా నాన్న నాగబాబుని మందలించారు.. ఆ తర్వాత నా కోపం కాస్త తగ్గింది. అంటూ సరదాగా గతంలో జరిగిన విషయాన్ని మళ్లీ గుర్తు చేసుకున్నారు చిరంజీవి..

చిరంజీవి సినిమాలు..
ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం దర్శకుడు వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో స్టాలిన్ సినిమా తర్వాత త్రిష మళ్లీ చిరంజీవితో జతకట్టనుంది.. అంతేకాదు ఈ సినిమాలో మరో ఐదుగురు హీరోయిన్స్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.. త్రిష మెయిన్ హీరోయిన్ కాగా మిగిలిన ఐదుగురు చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన చిన్నచిన్న పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి..

- Advertisement -

నాగబాబు కెరియర్..
ఒకప్పుడు హీరోగా కెరియర్ మొదలుపెట్టిన నాగబాబుకి పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేస్తూ వస్తున్నారు.. అంతేకాదు ఒకవైపు నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఈయన ప్రస్తుతం మరే కొత్త ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు