Shoaib Malik : అలాంటి మెసేజులు చేస్తున్నాడు… సానియా మీర్జా మాజీ భర్త బండారం బయట పెట్టిన పాక్ నటి

Shoaib Malik : రీసెంట్ గానే సానియా మీర్జాతో విడాకులు, మూడో పెళ్లితో వార్తల్లో నిలిచిన షోయబ్ వ్యక్తిగత జీవితం కారణంగా మరోసారి అందరి దృష్టిలో పడ్డాడు. ప్రముఖ మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్ పై పాక్ నటి చేసిన కంప్లైంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అలాంటి మెసేజ్ లు చేస్తున్నాడంటూ షోయబ్ పై సంచలన ఆరోపణలు చేసింది ఆ నటి. ఇంతకీ ఆ నటి ఎవరు? వీరిద్దరి మధ్య ఏం జరుగుతోంది? అనే విషయంలోకి వెళ్తే…

మూడో పెళ్ళై మూడు నెలలు కాలేదు.. అప్పుడే పక్క చూపులు…

పాకిస్తాన్ స్టార్ నటి నవల్ సయీద్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు పాకిస్తానీ క్రికెటర్ల నుంచి సరసాలు ఆడుతున్న విధంగా మెసేజ్ కు వస్తున్నాయని చెప్పి షాక్ ఇచ్చింది. పెళ్లయిన క్రికెటర్ల నుంచి కూడా అలాంటి మెసేజ్ లు వస్తున్నాయని చెప్పి పలు అనుమానాలకు తెర తీసింది. నవల్ సయీద్ ఈ విషయం చెప్పగానే షాక్ అయిన షో హోస్ట్ ఐజాస్ అస్లాం, నదియా ఖాన్ వెంటనే షోయబ్ మాలిక్ గురించి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. సయీద్ మాత్రం నవ్వుతూ తాను పేరు మరిచిపోయానని సమాధానాన్ని దాటవేసింది. దీంతో ఆ పెళ్లయిన క్రికెటర్ల లిస్ట్ లో షోయబ్ మాలిక్ ఉన్నాడని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇక వాళ్ళు ఎలాంటి మెసేజ్ లు పంపిస్తున్నారు అనే ప్రశ్నకు సయీద్ మాట్లాడుతూ యాక్టర్స్ కంటే క్రికెటర్లనే ఎక్కువ మంది ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి క్రికెటర్ లు ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ అసలు వాళ్ళు పంపిన మెసేజ్ లు ఏంటో చెప్పకుండా తప్పించుకుంది.

ఇక షోయబ్ మాలిక్ విషయానికి వస్తే…

ఈ పాక్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2010లో సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో వీరిద్దరు పెళ్లి వివాదానికి దారి తీసింది. సానియా పాక్ క్రికెటర్ ను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇండియాలో ఆమెకు తగ్గ వరుడు దొరకలేదా? అంటూ విమర్శలు గుప్పించారు. పైగా షోయబ్ కు సానియాతో రెండో పెళ్లి కావడం గమనార్హం. ఈ వివాదం నేపథ్యంలోనే దాదాపు 13 ఏళ్లు వీరిద్దరూ దుబాయ్ లో జీవించారు. ఇక సానియా, షోయబ్ జంట విడాకులు తీసుకున్నారని ఎన్నో ఏళ్లుగా రూమర్లు రాగా, ఈ ఏడాది జనవరిలో షోయబ్ మాలిక్ పాకిస్తాన్ నటి సనా జావేద్ ను మూడో పెళ్లి చేసుకోవడంతో విడాకుల వార్తలు నిజమని తేలింది. ఇక ఆయన మూడో పెళ్లి చేసుకొని పట్టుమని మూడు నెలలు కూడా కాలేదు. అప్పుడే షోయబ్ పక్క చూపులు చూస్తుండడంతో సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు సయీద్ పై కన్నేసిన షోయబ్ మూడో పెళ్లిని కూడా పెటాకులు చేసుకుని నాలుగో పెళ్ళికి సిద్ధమవుతాడా? అని ప్రశ్నిస్తున్నారు. కానీ షోయబ్ అభిమానులు మాత్రం పాపులర్ కావడానికి షోయబ్ ను ఆ నటి వాడుకుంటోంది అని మండిపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు