Priyanka Jawalkar : టిల్లు స్వ్కేర్‌లో విజయ్ బ్యూటీ… ఎవరూ పట్టించుకోవడం లేదేంటి..?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలబడటం అనేది సాధారణమైన విషయం కాదు. ఎన్నో ప్రయత్నాలు చేసి కొన్ని సినిమాల్లో ముందుగా చిన్న చిన్న పాత్రలలో కనిపించి, ఆ తర్వాత చిన్న సినిమాల్లో మెయిన్ లీడ్ గా చేసి ఆ తర్వాత పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే తెలుగు హీరోయిన్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ కాలం నిలబడలేకపోయారు. కేవలం 5,6 సినిమాలకు మాత్రమే పరిమితం అవుతూ ఉంటున్నారు.

ఇప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది తెలుగు హీరోయిన్స్ వచ్చారు. ఇక రీసెంట్ టైమ్స్ లో బేబీ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన వైష్ణవి చైతన్య మంచి పేరును సాధించుకుంది. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్స్ లో కూడా వైష్ణవి సినిమాను పూర్తి చేసింది. ముందుగా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించిన వైష్ణవి బేబీ సినిమాతో మంచి బ్రేక్ అందుకుంది అని చెప్పొచ్చు.

అలానే బాద్షా సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన రీతు వర్మ, ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కనిపించి మంచి గుర్తింపును సాధించుకుంది. ఇకపోతే ఆ తర్వాత రీతు వర్మ పెళ్లిచూపులు సినిమాతో మంచి బ్రేక్ అందుకుంది. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు రీతు వర్మని హీరోయిన్ గా నిలబెట్టాయి. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా రీతు వర్మ ప్రస్తుతం సినిమాలను చేస్తుంది.

- Advertisement -

మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన అంతకుముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈషా రెబ్బా, ఆ తర్వాత మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలలో చేసింది. అయితే ప్రస్తుతం ఈషా రెబ్బ చేస్తున్న సినిమాలు గురించి పెద్దగా అప్డేట్ అంటూ లేదు. చాలామంది హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలు చేసిన తర్వాత మిగతా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో అవకాశాలు లేకుండా పోతున్నాయి.

అయితే కొంతమందికి మాత్రం మొదటి సినిమా డిజాస్టర్ అయిన కూడా వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయని చెప్పొచ్చు. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీలకి మొదటి సినిమా డిజాస్టర్ అయిన కూడా వరుసగా అవకాశాలు లభించాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం. పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.

ఇకపోతే తెలుగు హీరోయిన్ ప్రియాంక జువల్కర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాక్సీవాలా సినిమాతో మంచి గుర్తింపును సాధించుకుంది. రీసెంట్ గా సూపర్ హిట్ అయిన టిల్లు స్క్వేర్ లో ప్రియాంక జువల్కర్ ఉంది. కానీ, ఎవరూ పట్టించుకోలేదు.ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి. బట్ ఎడిటింగ్ లో లేపేశారు. గతంలో భగవంత్ కేసరి లో కూడా ఛాన్స్ వచ్చింది. మేకర్స్ కూడా కన్ఫామ్ చేశారు. తర్వాత లాస్ట్ మూముంట్ లో తీసేశారు. హీరోయిన్గా కొన్ని సినిమాల్లో కనిపించినా కూడా మంచి పేరును సాధించుకున్న ప్రియాంకకి ప్రస్తుతం సరైన అవకాశాలు రావట్లేదని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు